Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Prabhas – Hanu Raghavapudi : ప్రభాస్ ఇటీవల కల్కి సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. నెక్స్ట్ ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో రాబోతున్నాడు. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో ఈ సినిమా షూట్ జరుగుతుంది. అయితే రాజాసాబ్ తర్వాత సలార్ 2, కల్కి 2, స్పిరిట్.. సినిమాలు ఉంటాయనుకున్నాను. కానీ ఆ సినిమాలన్నీ పక్కన పెట్టేసి ప్రభాస్ హను రాఘవపూడితో సినిమా మొదలుపెట్టాడు. నేడు ఉదయం ప్రభాస్ – హను రాఘవపుడి సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇక ఈ పూజా కార్యక్రమం నుంచి అధికారికంగా ఫొటోలు ఇంకా రాకపోయినా ప్రభాస్ ఫొటోలు లీక్ అయి వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. యుద్ధం బ్యాక్‌డ్రాప్ తో లవ్ స్టోరీ కథ అని, సినిమా టైటిల్ ‘ఫౌజీ’ అని టాలీవుడ్ సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్ ఆగస్టు 18 నుంచి ప్రారంభం కానుంది. మూడు వారాల పాటు మధురైలో ఈ షూట్ చేయనున్నట్టు తెలుస్తుంది.
Admin
Studio18 News