Sunday, 08 March 2026 03:32:41 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Rajamouli – RGV : రాజమౌళిని ఓ రేంజ్‌లో పొగిడిన ఆర్జీవీ.. బాహుబలి కథ నాకు చెప్పాడు.. ఈ సక్సెస్ తెలుగు సినిమాది కాదు..

Date : 23 July 2024 11:41 AM Views : 252

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Rajamouli – RGV : రాజమౌళి ఎంత గొప్ప దర్శకుడు అని మన అందరికి తెలిసిందే. తన సినిమాలతో రాజమౌళి సాధించిన విజయాల గురించి అంతా మాట్లాడుకుంటారు. హాలీవుడ్ లో కూడా స్టార్ డైరెక్టర్స్ సైతం రాజమౌళి గురించి గొప్పగా మాట్లాడారు. RRR తో ఆస్కార్ సాధించిన రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా తీయబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా రాజమౌళి గురించి ఆర్జీవీ గొప్పగా మాట్లాడాడు. ఒకప్పుడు గొప్ప సినిమాలు తీసి స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన ఆర్జీవీ ఇప్పుడు తనకు నచ్చినట్టు సినిమాలు చేస్తానని ప్రయోగాలు చేస్తున్నాడు. ఆర్జీవీ అంత సాధారణంగా ఎవర్ని పొగడడు. గతంలో కూడా రాజమౌళిని పొగుడుతూ ఆర్జీవీ మాట్లాడారు. తాజాగా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్జీవీ రాజమౌళి గురించి గొప్పగా చెప్పాడు.ఆర్జీవీ రాజమౌళి గురించి మాట్లాడుతూ.. నాకు బాహుబలి సినిమా రిలీజ్ ముందు వాళ్ళ ఇంటి బాల్కనీలో బాహుబలి కథ చెప్పాడు. సినిమా రిలీజ్ కి ముందు నాతో ఒక ప్రొడ్యూసర్ సినిమా ఫ్లాప్ అవుతుంది, చాలా ఎక్కువ బడ్జెట్ పెట్టేసారు అని అన్నాడు. రాజమౌళి అందరికంటే డిఫరెంట్. మగధీరతో అతన్ని అందరూ గుర్తించారు. ఈగ, బాహుబలితో కొత్తగా ట్రై చేసాడు. బాహుబలిలో ప్రతి ఫ్రేమ్ కి బాగా ఖర్చుపెట్టాడు. బాహుబలి కలెక్షన్స్ ని బాలీవుడ్ సినిమాలు కూడా కలెక్ట్ చేయలేవు. రాజమౌళి సక్సెస్ తెలుగు సినిమాది కాదు. ఇది కేవలం రాజమౌళిదే. రాజమౌళి ఎక్కడ పుట్టినా ఇలాగే సినిమాలు తీసేవాడేమో. RRRలో యాక్షన్ సీక్వెన్స్ లు చాలా యూనిక్ గా ఉంటాయి. RRR వల్లే ఇండియన్ సినిమా గురించి చాలా దేశాలకి తెలిసింది. ఇప్పుడు రాజమౌళి తీయబోయే సినిమా మన ఊహలకు కూడా అందదు. అన్ని సినిమాలని మించి ఉంటుంది. సినిమా ఎంత పెద్ద హిట్ అయినా రాజమౌళి గొప్పగా చెప్పుకోడు. సినిమా రిజల్ట్ పై అతనికి భయం ఉంటుంది. నిర్మాతలు పెట్టే డబ్బుకి న్యాయం చేయాలనే భయం ఉంటుంది. రాజమౌళి వేరే డైరెక్టర్స్ కి గేట్స్ ఓపెన్ చేసాడు. కొత్తగా ట్రై చేయడానికి కొత్త దర్శకులకు ఒక ఉదాహరణగా నిలిచాడు. రాజమౌళి ఎంత సాధించినా చాలా సింపుల్ లైఫ్ బతుకుతాడు. రాజమౌళి కంటే నాదే లగ్జరీ లైఫ్ అంటూ రాజమౌళిని ఆకాశానికెత్తేసాడు. దీంతో ఆర్జీవీ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :