Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Prabhas Sisters : నిన్న రాఖీ పండగ రోజున అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ళు అంతా రాఖీ పండగను ఘనంగా జరుపుకున్నారు. మన సినీ సెలబ్రిటీలు కూడా వారి వారి సోదరీసోదరీమణులతో రాఖీ పండగను సెలబ్రేట్ చేసుకున్నారు. కొంతమంది సెలబ్రిటీలు వారి రాఖీ సెలబ్రేషన్స్ ఫోటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ రాఖీ సెలబ్రేషన్స్ వైరల్ గా మారాయి. ప్రభాస్ చాలా అరుదుగా తన చెల్లెళ్ళతో కనిపిస్తాడు. కృష్ణంరాజు కూతుళ్లు ప్రభాస్ కి చెల్లెల్లు అవుతారని తెలిసిందే. చెల్లెల్లు అంటే ప్రభాస్ కి చాలా ఇష్టం. తాజాగా కృష్ణంరాజు కూతుళ్ళల్లో ప్రసీద, ప్రదీప్తి ఇద్దరూ నిన్న రాఖీ పండగ రోజున ప్రభాస్ కి రాఖీ కట్టిన ఫొటోలు తమ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలలో పోస్ట్ చేసారు. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. చెల్లెల్లు ప్రసీద, ప్రదీప్తి లతో ప్రభాస్ రాఖీ కట్టించుకునే ఫోటోలను ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. ఇక ఇటీవలే ప్రభాస్ హను రాఘవపూడి సినిమా పూజా కార్యక్రమాలతో మొదలయింది. ప్రస్తుతం రాజాసాబ్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు ప్రభాస్.
Admin
Studio18 News