Monday, 19 January 2026 08:25:28 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Raj Tarun: రాజ్‌తరుణ్- లావణ్య కేసులో మరో మలుపు.. పరస్పరం ఫిర్యాదు చేసుకున్న రాజ్‌తరుణ్ స్నేహితుడు శేఖర్, లావణ్య

Date : 05 August 2024 12:44 PM Views : 266

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : టాలీవుడ్ నటుడు రాజ్‌తరుణ్-నటి లావణ్య కేసులో ఇది మరో మలుపు. రాజ్‌తరుణ్ స్నేహితుడు ఆర్‌జే శేఖర్‌బాషా, లావణ్య పరస్పరం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. శేఖర్ తనపై దాడి చేశాడని లావణ్య.. లావణ్యే తనపై దాడికి యత్నించిందని శేఖర్ తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. శేఖర్‌బాషా ఓ యూట్యూబ్ చానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నాడు. చర్చ సందర్భంగా ఆయన పదేపదే లావణ్యపై ఆరోపణలు చేస్తుండడంతో ప్రశ్నించేందుకు లావణ్య అక్కడికి వెళ్లింది. ఈ క్రమంలో అక్కడ ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. అనంతరం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో లావణ్య ఫిర్యాదు చేస్తూ బాషా తనపై దాడికి పాల్పడడమే కాకుండా అమానుషంగా ప్రవర్తించాడని ఆరోపించింది. బాషా కూడా లావణ్యపై ఫిర్యాదు చేస్తూ తనపై దాడికి యత్నించిందని పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, రాజ్‌తరుణ్, తాను 11 ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్నామని, ఓ హీరోయిన్‌తో అఫైర్ పెట్టుకుని తనను వదిలేశాడంటూ లావణ్య ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :