Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : అమెరికాకు చెందిన ప్రఖ్యాత పాప్ సింగర్ జస్టిన్ బీబర్ తండ్రి అయ్యాడు. ఆయన భార్య హైలీ ఈ ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని బీబర్ ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలియజేశారు. వెల్కమ్ హోమ్ అంటూ చిన్నారి పాదాల ఫొటోను షేర్ చేశారు. చిన్నారికి జాక్ బ్లూస్ బీబర్ అని పేరు పెట్టారు. తాము తల్లిదండ్రులం కాబోతున్నట్టు ఈ ఏడాది ప్రారంభంలోనే బీజర్ దంపతులు ప్రకటించారు. 2018లో బీబర్, హైలీ న్యూయార్క్ లోని కోర్ట్ హౌస్ లో తొలుత పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత దక్షిణ కరోలినాలోని బ్లఫ్టన్ లో తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో మరోసారి వివాహం చేసుకున్నారు.
Admin
Studio18 News