Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Balakrishna NBK 109 : అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వరుసగా మూడు బ్లాక్ బాస్టర్ హిట్లతో నందమూరి బాలకృష్ణ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఆయన బాబీ దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్నారు. NBK109 వర్కింగ్ టైటిల్‌తో మూవీ తెరకెక్కుతోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ పై నాగవంశీ, సౌజన్య ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఓ సాలిడ్ అప్‌డేట్ డైరెక్టర్ బాబీ ఇచ్చాడు. ఈ చిత్రంలోని ఓ కీలక సీక్వెన్స్‌కి సంబంధించిన షూటింగ్‌ను ఇటీవల జైపూర్‌లో షూట్ చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. ఈ సీక్వెన్‌లో బాలకృష్ణ విశ్వరూపం చూపించారన్నాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్ తెలియజేయనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ బాలకృష్ణతో కలిసి ఉన్న ఓ ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఈసినిమా టైటిల్ ఎలా ఉంటుందోనని. టీజర్ ఎప్పుడు వస్తుందా అని నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
Admin
Studio18 News