Sunday, 08 February 2026 11:36:44 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

HBD Mahesh Babu: ఇందుకే మహేశ్ బాబు సూపర్ స్టార్ అయ్యాడు.. లేకపోతేనా..

Date : 09 August 2024 03:46 PM Views : 230

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : HBD Mahesh Babu: అగ్ర హీరోల్లో ఒకరిగా వెలుగొందుతున్నాడు సూపర్ స్టార్ మహేశ్‌ బాబు. సినీ పరిశ్రమలో అజాత శత్రువుగా కనపడే ఈ ఒక్కడు.. సినిమాల్లో మాత్రం దూకుడు తగ్గకుండా దూసుకెళ్తున్నాడు. ఈ నాని వయసు 47 అయినా అభిమానుల మనసుల్లో ఇప్పటికీ, ఎప్పటికీ 25 ఏళ్ల రాజ కుమారుడే. శ్రీమంతుడు అయినప్పటికీ సమాజానికి సైనికుడిలా సేవలు అందిస్తున్నాడు… సరిలేరు నీకెవ్వరు అనిపించుకుంటున్నాడు. అందుకే అందరూ ఆయనను సూపర్ స్టార్ అంటున్నారు. చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాడు. హీరోగా రాజకుమారుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుని కమర్షియల్ హీరోగా వెలుగొందుతున్నాడు. మహేశ్‌ బాబు హీరోగా నటించిన హిట్‌ సినిమాల గురించి ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలుసుకుందాం… రాజకుమారుడు: మహేశ్‌ బాబు హీరోగా నటించిన ఈ తొలి చిత్రం 1999 లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తీశారు. మహేశ్ సరసన ఈ సినిమాలో ప్రీతి జింటా నటించింది. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీ దత్ నిర్మించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించాడు. ఈ సినిమా హిందీలోనూ రీమేక్ అయింది. మురారి: కృష్ణవంశీ దర్శకత్వంలో అల్లరి చేస్తూ, నవ్వులు పుట్టిస్తూ మహేశ్‌ బాబు ఈ సినిమాలో నటించాడు. ఈ సినిమాని రామ్ ప్రసాద్ ఆర్ట్స్ పతాకంపై నందిగం గోపి, రామలింగేశ్వరరావు, ఎన్. దేవిప్రసాద్ నిర్మించారు. మహేశ్ బాబు సరసన సోనాలి బింద్రే నటించింది. ఈ సినిమాకి కూడా మణిశర్మ సంగీతం అందించారు. ఒక్కడు: మహేశ్‌ బాబుకి విపరీతంగా ఫాలోయింగ్‌ తెచ్చి పెట్టిన సినిమా ఒక్కడు. ఈ సినిమా 2003లో గుణశేఖర్ దర్శకత్వంలో విడుదలైంది. అప్పట్లో అనేక థియేటర్లలో ఏకంగా 175 రోజులు ఆడి రికార్డు సృష్టించింది. మహేశ్ బాబు సరసన ఈ సినిమాలో భూమిక నటించగా ప్రకాశ్ రాజ్ విలన్‌గా నటించాడు. ఈ సినిమా తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లోనూ రీమేక్‌ అయింది. అతడు: మురారీ, ఒక్కడు, రాజకుమారుడు వంటి సినిమాల్లో అల్లరి చేస్తూ కనపడిన మహేశ్‌ బాబు ఈ సినిమాలో మాత్రం సీరియస్‌గా కనపడతాడు. ఈ సినిమా 2005లో విడులైంది. మహేశ్ సరసన త్రిష నటించిన ఈ సినిమాకి త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించాడు. పోకిరి: అతడు వంటి సూపర్‌ హిట్ సినిమా తరువాత మహేశ్‌ బాబు వెను వెంటనే పోకిరి సినిమాతో మరో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 2006లో విడుదలైన ఈ సినిమా అత్యధిక కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాతో మహేశ్‌ బాబు మాస్‌ ఇమేజ్‌ మరింత పెరిగింది. ఈ సినిమాను పూరీ జగన్నాథ్‌ తెరకెక్కించాడు. పోకిరిలో మహేశ్ సరసన ఇలియానా నటించింది. దూకుడు: పోకిరి తరువాత హిట్లు లేక సతమతమవుతోన్న మహేశ్‌ బాబుకి దర్శకుడు శ్రీను వైట్ల 2011లో దూకుడు సినిమాతో భారీ హిట్‌ ఇచ్చాడు. ఈ సినిమాలో మహేశ్‌ బాబు సరసన సమంత నటించింది. బిజినెస్ మేన్: ఈ హైఓల్టేజ్ యాక్షన్ మూవీలో సూర్య పాత్రలో నటించాడు మహేశ్. ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు: మహేశ్‌ బాబు కెరీర్‌లో ఫ్యామిలీ ఆడియెన్స్ ను మరింత అలరించిన చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. వెంకటేశ్ తో కలిసి నటించి లేడీస్ ఫాలోయింగ్ ను మరింత పెంచుకున్నాడు మహేశ్. శ్రీమంతుడు: ఈ సినిమా కూడా మహేశ్‌ బాబు సూపర్‌ హిట్‌ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. 2015 ఆగస్టు 7న విడుదలైన ఈ సినిమా సామాజిక బాధ్యత ప్రధానాంశంగా వచ్చింది. ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన శ్రుతి హాసన్‌ నటించింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. సినీ చరిత్రలో.. మహేశ్‌ బాబు భారీ హిట్‌ సినిమాలు ఇవే.. భరత్ అనే నేను: ఈ సినిమా మహేశ్‌కు మరో భారీ విజయాన్ని అందించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ సినిమాలో మహేశ్‌ బాబు నటించారు. ఏప్రిల్ 20న థియేటర్స్‌లోకి వచ్చిన ఈ సినిమా సొసైటీ అంటే అందరికీ భయం, బాధ్యత ఉండాలంటూ సామాజిక బాధ్యతను గుర్తు చేసింది. ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మహర్షి: ఈ సినిమా 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భరత్ అనే నేను తర్వాత వచ్చిన వరుసగా రెండో హిట్ మహేశ్ బాబు ఖాతాలో పడింది. ఈ సినిమాలో రిషిగా ఆకట్టుకున్న మహేశ్ బాబుతో కలిసి అల్లరి నరేశ్, పూజ హెగ్డే ప్రధాన పాత్రల్లో నటించారు. సరిలేరు నీకెవ్వరు: ఈ సినిమా 2020లో విడుదలైంది. అజయ్ కృష్ణ పాత్రలో మహేశ్ బాబు నిజంగానే సరిలేరు నీకెవ్వరు అనిపించాడు. దేశ సరిహద్దుల్లో సైనికుడు అంతగా కష్టపడుతోంటే, సొంత దేశాన్ని కొందరు ఎలా నాశనం చేస్తున్నారో చెప్పాడు. ఒక్కడు సినిమా తర్వాత కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద ఓ సీన్ లో కనపడి మహేశ్ అలరించాడు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :