Thursday, 12 March 2026 03:24:37 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Devara Song : దేవర మూడో పాటపై లిరిసిస్ట్ ట్వీట్.. ఈ సాంగ్ వేరే లెవల్.. ఎన్టీఆర్ స్టెప్స్..

Date : 28 August 2024 11:39 AM Views : 258

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Devara Song : కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ – జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కుతున్న దేవర సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న దేవర నుంచి మొదటి పార్ట్ సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, రెండు సాంగ్స్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. త్వరలో మూడో సాంగ్ కూడా రిలీజ్ కానుందని వార్తలు వస్తున్నాయి. దేవర సాంగ్స్ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి తాజాగా తన ట్విట్టర్లో దేవర మూడో సాంగ్ పై ట్వీట్ చేసారు. రామజోగయ్య శాస్త్రి తన ట్వీట్ లో.. మూడో పాట.. పాటకు మించిన ఆట.. కన్నుల పండగ. ఒక ఆట ఆడుకున్నాడట తారకరాముడు. ఎప్పుడని అడక్కండి. ఎప్పుడొచ్చినా భీభత్సమే పక్కా. ఈ ఆల్బమ్ వేరే లెవెల్ అంతే అని రాసుకొచ్చారు. దీంతో ఈ మూడో పాటలో ఎన్టీఆర్ అదిరిపోయే స్టెప్స్ వేయనున్నట్టు, ఈ సాంగ్ ఓ రేంజ్ లో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. సెప్టెంబర్ మొదటివారంలో ఈ సాంగ్ ని విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. దీంతో ఈసారి దేవర పాట తో పాటు ఎన్టీఆర్ స్టెప్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇటీవలే దేవర నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేసి ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ అని హింట్ ఇచ్చారు మూవీ యూనిట్.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :