Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్‌లో ఉందంటూ రూమర్లు వినిపిస్తున్నవేళ తాజాగా ఆమె తొలిసారి ముంబైలో కనిపించడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. ఆమె తన కారులో కూర్చుని ఫోన్‌లో మాట్లాడుతున్న ఫొటోలు బయటకు వచ్చి వైరల్ అయ్యాయి. రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే కలిసి ‘రాజ్ అండ్ డీకే’గా కలిసి సినిమాలు చేస్తుంటారు. వీరిలో కలిసి సమంత గతంలో ‘ఫ్యామిలీమ్యాన్ 2’ సీజన్‌లో పనిచేసింది. ప్రస్తుతం మళ్లీ వారి కాంబినేషన్‌లోనే ‘సిటాడెల్: హనీ బన్నీ’ చేస్తోంది. ఇందులో ఆమె సరసన వరుణ ధావన్ నటిస్తున్నాడు. సమంత మాజీ భర్త నాగచైతన్య ఇటీవల శోభిత ధూళిపాళతో నిశ్చితార్థం చేసుకున్న తర్వాత సమంత కూడా త్వరలోనే పెళ్లికి సిద్దమవుతోందంటూ ఇంటర్నెట్‌లో వార్తలు హల్‌చల్ చేశాయి. దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె డేటింగ్‌లో ఉందన్న వార్తలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడామె ముంబైలో అడుగుపెట్టడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చిందని, వారిద్దరి డేటింగ్ వార్తలు నిజమేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Admin
Studio18 News