Monday, 08 December 2025 04:08:44 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Nagababu – Pawan Kalyan : నా అప్పులు తీర్చడానికే ‘గబ్బర్ సింగ్’ చేసాడు.. రెమ్యునరేషన్ విషయంలో బండ్ల గణేష్‌తో పవన్ ఒప్పందం ఇదే..

Date : 02 September 2024 12:17 PM Views : 170

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Nagababu – Pawan Kalyan : నేడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా గబ్బర్ సింగ్ ని థియేటర్స్ లో రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అభిమానులు థియేటర్స్ లో గబ్బర్ సింగ్ సినిమాతో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో నాగబాబు గబ్బర్ సింగ్ సమయంలో జరిగిన పలు సంఘటనల గురించి ఒక వీడియో చేసి తన N మీడియా ఎంటర్టైన్మెంట్ లో షేర్ చేసారు. ఈ వీడియోలో నాగబాబు ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు. గబ్బర్ సింగ్ ముందు నాగబాబు ఆరెంజ్ సినిమా చేసి అప్పుల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. గతంలో పలుమార్లు ఆరెంజ్ సినిమా వల్ల అప్పులు అయితే పవన్ కళ్యాణ్ తన అప్పులు తీర్చాడని నాగబాబు చెప్పాడు. ఇప్పుడు ఆ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. నాగబాబు మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్ బ్రదర్ దగ్గర దబాంగ్ రైట్స్ తీసుకున్నాము. ప్రాఫిట్స్ లో అన్నయ్య అప్పులు తీర్చేసి ఆ తర్వాత నాకేమన్నా వస్తే రెమ్యునరేషన్ ఇవ్వు లేకపోతే లేదు అని పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ తో ఒప్పందం పెట్టుకున్నాడు. దానికి గణేష్ ఓకే అన్నాడు. సినిమా బాగా వచ్చింది. అయితే పవన్ మళ్ళీ రిలీజ్ కి ముందు సినిమా చూసి గణేష్ కి ఇచ్చిన ప్రపోజల్ మార్చేశాడు. సినిమా హిట్ అవుతుంది, నీ ప్రాఫిట్స్ నువ్వు తీసుకో, నీకు ఇవ్వాలనిపించిన రెమ్యునరేషన్ నాకు ఇవ్వు. దాంతో మా అన్నయ్య అప్పులు నేను తీర్చుకుంటాను. నువ్వేమి మా అన్నయ్య అప్పులు తీర్చిద్దు అని చెప్పాడు. గణేష్ దానికి కూడా సరే అన్నాడు. ఆ సినిమాకు లాభాలు చాలానే వచ్చాయి. పవన్ తన రెమ్యునరేషన్ తో నా అప్పులు మొత్తం తీర్చేసాడు. నా అప్పులు తీర్చడానికే పవన్ గబ్బర్ సింగ్ సినిమా చేసాడు. అప్పటికి పవన్ కళ్యాణ్ కూడా ఫైనాన్షియల్ గా కష్టాల్లోనే ఉన్నాడు. అయినా నా కోసం నిలబడ్డాడు అని తమ్ముడి గురించి గొప్పగా చెప్పాడు. దీంతో మరోసారి పవన్ ని అభినందిస్తున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :