Wednesday, 17 December 2025 03:36:13 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

Akshay Kumar: స్పెష‌ల్ పోస్ట‌ర్‌తో అక్ష‌య్ కుమార్‌కు 'క‌న్న‌ప్ప' టీమ్ బ‌ర్త్ డే విషెస్

Date : 09 September 2024 03:31 PM Views : 182

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : టాలీవుడ్ న‌టుడు మంచు విష్ణు టీమ్‌ నుంచి వస్తున్న పాన్ ఇండియా చిత్రం కన్నప్ప. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మంచు విష్ణు టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నాడు. అలాగే మోహన్‌బాబు, ప్రభాస్‌, మోహన్‌ లాల్‌, నయనతార, మధుబాల, శరత్‌కుమార్‌, శివరాజ్‌కుమార్‌ ఇతర నటీనటులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ కూడా కీ రోల్‌ చేస్తున్నాడు. శివుడి పాత్ర‌లో అక్ష‌య్ క‌నిపించ‌బోతున్నాడు. ఇవాళ ఈ బాలీవుడ్ ఖిలాడీ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా క‌న్న‌ప్ప చిత్రం యూనిట్ ఆయ‌న‌కు ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ప్ర‌త్యేకంగా బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేసింది. "హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అక్షయ్ కుమార్. ఈ చిత్రంలో మీరు శివుని పాత్ర పోషించడం మీ అచంచలమైన అంకితభావానికి నిదర్శనం" అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు శివుడి పాత్ర‌ధారి అక్ష‌య్ కుమార్ తాలూకు ఓ ఫొటోను కూడా జోడించింది. కాగా, అక్షయ్‌కుమార్ టాలీవుడ్ ఎంట్రీ ప్రాజెక్ట్‌ కావడంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలాఉంటే.. క‌న్న‌ప్ప మూవీ నుంచి ఇప్ప‌టికే వివిధ పాత్ర‌ల‌కు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్ పోస్టర్ల‌ను మేక‌ర్స్ విడుద‌ల చేయ‌గా, వాటిపై మంచి స్పంద‌న వ‌చ్చింది. దీంతో ఈ సినిమాపై మూవీ యూనిట్‌ మంచి అంచ‌నాలు పెట్టుకుంది. మంచు విష్ణు కూడా చిత్రం భారీ విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని ఆశాభావంతో ఉన్నాడు. ఇక ఈ చిత్రానికి మణిశర్మ, స్టీఫెన్‌ దేవసి మ్యూజిక్, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ సమకూరుస్తున్నారు. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ, అవా ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీకి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్‌, తోట ప్రసాద్‌ స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :