Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత ఢిల్లీ బాబు మృతి చెందారు. ఆయన వయసు 50 సంవత్సరాలు. అనారోగ్య కారణాలతో ఆయన తుదిశ్వాస విడిచారు. రాత్రి 12.30 గంటలకు ఆయన మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈరోజు చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని వెల్లడించారు. అనారోగ్యం కారణంగా కొంతకాలంగా ఢిల్లీ బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఆరోగ్యం విషమించడంతో ఆయన కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సినీ, రాజీకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ బాబు మృతి కోలీవుడ్ కు తీరని లోటు అని సినీ ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు. యాక్సెస్ ఫిల్మ్ బ్యానర్ పై ఆయన ఎన్నో చిత్రాలను నిర్మించారు. ఢిల్లీ బాబు నిర్మించిన బ్యాచిలర్, ఓ మై గాడ్, రాక్షసన్, మరకతమణి, మిరల్ తదితర ఎన్నో చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఆయన నిర్మించిన కొన్ని చిత్రాలు తెలుగులో కూడా డబ్ అయి... హిట్ కొట్టాయి. కొత్తవారితో సినిమాలు నిర్మించడం ఢిల్లీ బాబు ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఇదే ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది.
Admin
Studio18 News