Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Chiru- Pawan – Charan : నిన్న వినాయక చవితి సందర్భంగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేసి రెండో సాంగ్ సెప్టెంబర్ లో వస్తుందని చెప్తూ అప్డేట్ ఇచ్చారు. అయితే ఈ పోస్టర్ లో ఉన్న రామ్ చరణ్ ఫోటో బాగా వైరల్ అవుతుంది. అది ఓ సాంగ్ లోని ఫోటో అని తెలుస్తుంది. ఇందులో రామ్ చరణ్ తలకు రెడ్ టవల్ కట్టుకొని ఉన్నాడు. రెడ్ టవల్ పవన్ కళ్యాణ్ వల్ల బాగా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. గబ్బర్ సింగ్ సినిమా సమయంలో సినిమాలో వాడటమే కాకుండా జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ రెడ్ టవల్ మీద వేసుకోవడంతో బాగా వైరల్ అయింది. ఇప్పుడు రామ్ చరణ్ తలకు రెడ్ టవల్ కట్టుకున్న పోస్టర్ రిలీజ్ చేయడంతో మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ ని చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో పోలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో ఇలా రెడ్ టవల్ తలకు చాలా సార్లు కట్టుకున్నాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి గతంలో ముఠామేస్త్రి సినిమాలో తలకు ఒక కార్మికుడిగా రెడ్ టవల్ కట్టుకున్నారు. దీంతో చిరంజీవి, పవన్ కళ్యాణ్ తలకు రెడ్ టవల్స్ కట్టుకున్న ఫొటోలు తీసి వాటి పక్కన ఇప్పటి చరణ్ ఫోటో పెట్టి నాన్న, బాబాయ్ లను గుర్తుచేస్తున్నారు చరణ్ అంటూ అభిమానులు మురిసిపోతున్నారు. గేమ్ ఛేంజర్ లో చిరు, పవన్ రిఫరెన్స్ లు బాగానే వాడినట్టు ఉన్నారని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Admin
Studio18 News