Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Revanth Reddy – Ali : తాజాగా కమెడియన్ అలీ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఇటీవల ఏపీ, తెలంగాణాలో వరదలు వచ్చి పలు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో వరద బాధితుల కోసం కమెడియన్ అలీ ఆంధ్రప్రదేశ్‌కు 3 లక్షలు, తెలంగాణకు 3 లక్షలు సాయం ప్రకటించారు. నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అలీ దంపతులు కలిసి 3 లక్షల రూపాయల చెక్ ను అందించారు. సీఎం రేవంత్ రెడ్డి అలీకి ధన్యవాదాలు తెలిపి శాలువాతో సత్కరించారు. నేడు మెగాస్టార్ చిరంజీవి కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వరద బాధితుల కోసం ప్రకటించిన ఆర్ధిక సహాయాన్ని అందించారు.
Admin
Studio18 News