Sunday, 08 March 2026 09:50:39 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Devara Promotions : తెలుగు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి షాక్.. ‘దేవర’ తెలుగు ప్రమోషన్స్ లేవా?

Date : 10 September 2024 11:51 AM Views : 253

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Devara Promotions : ఎన్టీఆర్ దేవర సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోతున్న పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాకి ప్రమోషన్స్ కూడా భారీగా చేస్తారు, ఎన్టీఆర్ మీడియా ముందుకు వస్తాడు, ఫ్యాన్స్ ని కలుస్తారు అని అనుకున్నారు. అయితే తాజాగా సమాచారం ప్రకారం దేవర సినిమాకు తెలుగులో ఎక్కువ ప్రమోషన్స్ చేయరట. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర ట్రైలర్ లాంచ్ కి ముంబైకి వెళ్లిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో దేవర ట్రైలర్ లాంచ్ గ్రాండ్ గా చేయనున్నారు. ఆ తర్వాత ముంబైలో రిలీజ్ కి ముందు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేస్తారట. ఎన్టీఆర్ బాలీవుడ్ లో పాతుకుపోవడానికి, అక్కడ మార్కెట్ తెచ్చుకోడానికి బాగానే కష్టపడుతున్నాడు. కానీ ఇప్పటి వరకు దేవర తెలుగు ప్రమోషన్స్ మొదలుపెట్టలేదు. RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ మూడు నాలుగు సార్లు సినిమా ఈవెంట్స్, ఓపెనింగ్స్ లో తప్ప మీడియా ముందుకు రాలేదు. తెలుగులో దేవర సినిమా ఎలాగు చూస్తారు. ఫ్యాన్స్ థియేటర్స్ కి వెళతారు, సినిమా మీద హైప్ ఉంది కాబట్టి ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్తారు. ఇక్కడ కలెక్షన్స్ కూడా భారీగానే వస్తాయి. దేవర ప్రమోషన్స్ తెలుగు రాష్ట్రాల్లో చేయకపోయినా ఎలాంటి నష్టం ఉండదు అని భావిస్తున్నారు. తెలుగులో కేవలం ఒకటే ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమా ముందు ఫ్యాన్స్ కోసం భారీగా నిర్వహిస్తారట. అలాగే ముందే రికార్డ్ చేసిన కొన్ని ఇంటర్వ్యూలు రిలీజ్ చేస్తారట. దేవర సినిమాకి ఎలాంటి ప్రెస్ మీట్స్ ఉండవని టాలీవుడ్ సమాచారం. మీడియా ముందుకు ఎన్టీఆర్, కొరటాల శివ రారని తెలుస్తుంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విషయంలో నిరాశ చెందుతున్నారు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడితేనే ఎక్కువ విషయాలు మాట్లాడొచ్చు, ఎక్కువసార్లు ఎన్టీఆర్ బయట కనిపిస్తారు అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి ఎన్టీఆర్ దేవర తెలుగులో ప్రమోషన్స్ చేస్తారా లేదా చూడాలి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :