Thursday, 12 March 2026 01:05:28 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Adivi Sesh: నాకు మరో ట్యాగ్ వద్దు... అమ్మానాన్న ఇచ్చిన ట్యాగ్ చాలు: అడివి శేష్

Date : 18 December 2025 06:17 PM Views : 173

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : పేరు ముందు ట్యాగ్‌లు పెట్టుకోవడం ఇష్టం ఉండదన్న అడివి శేష్ 'డెకాయిట్' చిత్ర టీజర్‌ హైదరాబాద్‌లో విడుదల వచ్చే ఏడాది ఉగాదికి 'డెకాయిట్ మంచి సినిమా ఇవ్వాలనే ఉద్దేశంతోనే గ్యాప్ తీసుకుంటున్నా అని అడివి శేష్ వెల్లడి మృణాల్ ఠాకూర్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అని వ్యాఖ్యలు హీరోలు తమ పేరు ముందు బిరుదులు, ట్యాగ్‌లు పెట్టుకోవడం సాధారణం. కానీ, యువ కథానాయకుడు అడివి శేష్ మాత్రం అందుకు భిన్నం. తన పేరుకు ముందు ఎలాంటి ట్యాగ్ పెట్టుకోకపోవడానికి గల కారణాన్ని ఆయన తాజాగా వెల్లడించారు. "మా అమ్మానాన్న నాకు చిన్నప్పుడే 'అడివి శేష్' అనే ట్యాగ్ ఇచ్చారు. అందుకే మరో ట్యాగ్ వద్దు అనుకున్నా. ఏదో ఒక ట్యాగ్ పెట్టుకుని, పీఆర్ వాళ్లతో లోగోలు చేయించుకోవడం నాకు నచ్చదు. తరతరాలు గుర్తుండిపోయే సినిమాలు తీసి ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించడమే నాకు ఇష్టం" అని ఆయన స్పష్టం చేశారు. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ యాక్షన్ చిత్రం 'డెకాయిట్'. షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా శేష్ మాట్లాడుతూ, 'డెకాయిట్' చిత్రానికి మృణాల్ ఠాకూర్ ప్రత్యేక ఆకర్షణ అని తెలిపారు. సినిమాల మధ్య గ్యాప్ ఎందుకు వస్తుందన్న ప్రశ్నకు.. "ఒక చిన్న టీజర్ కోసమే గంటల తరబడి కష్టపడ్డాం. నాణ్యమైన సినిమాను ప్రేక్షకులకు అందించాలనేదే నా ఉద్దేశం. అందుకే ఆలస్యమైనా ఫర్వాలేదు" అని వివరించారు. 'డెకాయిట్' చిత్రం వచ్చే ఏడాది మార్చి 19న ఉగాదికి విడుదల కానుందని తెలిపారు. అలాగే, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'గూఢచారి 2' కూడా వచ్చే ఏడాదే మరో పండగకు వస్తుందని ప్రకటించారు. పెద్ద సినిమాల మధ్య విడుదల చేయడంపై నిర్మాత సుప్రియ మాట్లాడుతూ.. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని, సినిమా విజయంపై నమ్మకం ఉందని అన్నారు. గతంలో అగ్ర హీరోల సినిమాల మధ్యే 'మేజర్' విడుదలై ఘన విజయం సాధించిందని అడివి శేష్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :