Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ నేడు కడపకు వెళుతున్నారు. కడపలో జరుగుతున్న అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలకు ఆయన హాజరవుతున్నారు. దర్గాలో నేడు జరగనున్న ముషాయిరా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. ఈ సాయంత్రం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు రామ్ చరణ్ చేరుకుంటారు. అక్కడి నుంచి అభిమానుల సమక్షంలో భారీ ర్యాలీతో దర్గాకు చేరుకుని, దర్గా ఉత్సవాల్లో పాల్గొంటారు. దర్గాలో ప్రార్థనలను నిర్వహించిన తర్వాత రాత్రి 10.30 గంటలకు హైదరాబాద్ కు తిరుగుపయనమవుతారు. రామ్ చరణ్ కడపకు వస్తున్న నేపథ్యంలో కడప పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. కడప అమీన్ పీర్ దర్గాకు ఎంతో విశిష్టత ఉంది. ఇప్పటివరకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దర్గాను దర్శించుకున్నారు.
Also Read : కష్టకాలంలో పెదనాన్న, పెద్దమ్మ అండగా నిలిచారు: నారా రోహిత్
Admin
Studio18 News