Thursday, 12 March 2026 12:23:28 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Anaganaga Oka Raju: బాక్సాఫీస్ వద్ద నవీన్ పోలిశెట్టి హవా.. 100 కోట్ల క్లబ్‌లో 'అనగనగా ఒక రాజు'

Date : 19 January 2026 06:48 PM Views : 79

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : సంక్రాంతి బరిలో సత్తా చాటిన 'అనగనగా ఒక రాజు' కేవలం ఐదు రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లు యూఎస్‌లో 1 మిలియన్ డాలర్లు.. హ్యాట్రిక్ కొట్టిన నవీన్ క్లీన్ కామెడీతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న సినిమా కంటెంట్ బలంతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న నవీన్ పోలిశెట్టి యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి బాక్సాఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటారు. ఆయన కథానాయకుడిగా నటించిన 'అనగనగా ఒక రాజు' చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరి సంచలనం సృష్టించింది. సంక్రాంతి కానుకగా ఈ నెల‌ 14న విడుదలైన ఈ సినిమా, కంటెంట్ ఉన్న చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారని మరోసారి రుజువు చేసింది. స్టార్‌డమ్‌ కంటే కథకే ప్రాధాన్యత ఇచ్చే నవీన్, ఈ చిత్రంతో తన మార్కెట్‌ను అగ్రస్థాయికి తీసుకెళ్లారు. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లిన ఈ చిత్రం వసూళ్లలోనూ అదే జోరు చూపించింది. మొదటి రోజే రూ. 22 కోట్ల గ్రాస్ సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. కేవలం మూడు రోజుల్లో రూ. 61.1 కోట్లు రాబట్టిన ఈ సినిమా, ఐదు రోజులు పూర్తయ్యేసరికి రూ. 100.2 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. పెద్ద సినిమాల పోటీ మధ్యలోనూ నవీన్ సినిమా ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం విశేషం. క్లీన్ కామెడీ, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే భావోద్వేగాలతో దర్శకుడు మారి ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా నవీన్ పోలిశెట్టి తనదైన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో సినిమాకు ప్రాణం పోశారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. 'ఇదే అసలైన పండగ సినిమా' అంటూ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ల నుంచి బయటకు వస్తుండటం ఈ సినిమా విజయానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఓవర్సీస్‌లోనూ 'రాజు' గర్జన స్వదేశంలోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ 'రాజు' గర్జన కొనసాగుతోంది. ముఖ్యంగా యూఎస్‌ మార్కెట్‌లో ఈ చిత్రం 1 మిలియన్ డాలర్ల వసూళ్లను అధిగమించింది. దీంతో 'జాతి రత్నాలు', 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రాల తర్వాత వరుసగా మూడోసారి 1 మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరిన సినిమాగా నిలిచింది. ఈ హ్యాట్రిక్ విజయంతో అమెరికాలో నవీన్ పోలిశెట్టి తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్కెట్‌ను సృష్టించుకున్నారు. కథ, పాత్రల బలాన్ని నమ్ముకుని సినిమాలు చేసే నవీన్, తన విజయపరంపరను కొనసాగిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :