Saturday, 24 January 2026 09:15:11 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

OG Movie : ఓజీ నుంచి పవర్ ఫుల్ సాంగ్ వచ్చేసింది.. థియేటర్లలో ఇక తుఫానే..

ప్రస్తుతం ఎక్కడా చూసినా 'ఓజీ' పేరు మారుమోగిపోతోంది. 2025లో ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాలలో ఒకటని అందరూ దీనిని అభివర్ణిస్తు

Date : 15 September 2025 07:59 PM Views : 600

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ఇటీవల ‘ఓజీ’ చిత్రం నుండి విడుదలైన ‘ట్రాన్స్ ఆఫ్ ఓమి’ సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ తుఫాను నుండి అభిమానులు ఇంకా బయటకు రాకముందే, ‘గన్స్ ఎన్ రోజెస్’ అనే మరో సంచలన పాటతో ‘ఓజీ’ చిత్ర బృందం తిరిగి వచ్చింది. ఈ గీతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. సంగీత సంచలనం తమన్ ఎస్ స్వరపరిచిన ఈ పాట, శ్రోతలను ‘ఓజీ’ ఉత్కంఠభరితమైన, యాక్షన్-ప్యాక్డ్ ప్రపంచంలోకి తీసుకెళుతుంది. తమన్ తనదైన స్వరకల్పనతో మరో అగ్ని తుఫానుని సృష్టించారు. ఉరుములను తలపించే బీట్స్, పదునైన అమరికలతో మలిచిన ‘గన్స్ ఎన్ రోజెస్’ గీతం.. చిత్ర కథ తీవ్రత, స్థాయిని సంపూర్ణంగా సంగ్రహిస్తుంది. థమన్ అత్యున్నత సంగీత నైపుణ్యం ఈ గీతాన్ని.. ‘ఓజీ’ ప్రపంచం నాడి, శక్తి, చీకటిని ప్రతిబింబించే గొప్ప ధ్వని అనుభవంగా మార్చింది. తాజాగా విడుదలైన ఈ సాంగ్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది. ‘ట్రాన్స్ ఆఫ్ ఓమి’ అద్భుతమైన విజయం తర్వాత విడుదలైన ఈ ‘గన్స్ ఎన్ రోజెస్’ గీతం.. సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకొని వెళ్ళింది. ఈ గీతం ‘ఓజీ’ ప్రపంచంలోకి దూసుకెళ్లి.. దాని గందరగోళం, భావోద్వేగాలు, భారీ యుద్ధాలను అన్వేషిస్తుంది. ఇది కేవలం పాట కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోషించిన శక్తివంతమైన పాత్ర గంభీరమైన, క్రూరమైన ప్రపంచం, అతని చుట్టూ ఉన్న ప్రమాదకరమైన శక్తులను పరిచయం చేసే ఒక గ్లింప్స్. సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాకి ఇంకా 10 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో.. ప్రేక్షకుల్లో ఉత్సాహం నెలకొంది. అభిమానులు ఇప్పటికే సంబరాలు జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్ర ట్రైలర్ త్వరలో విడుదల కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలో రానుంది. ‘ఓజీ’ ట్రైలర్ మరో భారీ సంచలనాన్ని సృష్టిస్తుంది అనడంలో సందేహం లేదు.

దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని ఒక సినిమాటిక్ తుఫానుగా రూపొందిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గంభీరగా గర్జించనున్న ‘ఓజీ’ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :