Sunday, 25 January 2026 05:00:00 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Srilakshmi: విషం తాగడం తప్ప మరో మార్గం లేదంది మా అమ్మ: నటి శ్రీలక్ష్మి

Date : 08 September 2025 07:15 PM Views : 279

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : హాస్యనటిగా శ్రీలక్ష్మికి పేరు తమ ఫాదర్ పెద్ద హీరో అని వెల్లడి నిర్మాతగా నష్టపోయారని వివరణ అనారోగ్యంతో చనిపోయారని ఆవేదన ఫ్యామిలీ కోసం సినిమాల్లోకి రావలసి వచ్చిందన్న శ్రీలక్ష్మి తెలుగు తెరపై హాస్య నటిగా శ్రీలక్ష్మి ఒక వెలుగు వెలిగారు. అప్పట్లో జంధ్యాల సినిమాలు శ్రీలక్ష్మి లేకుండా ఉండేవి కాదు. ఆమె తరువాత ఆ స్థాయిలో హాస్యాన్ని పండించిన నటి మరొకరు లేరనే చెప్పాలి. సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన శ్రీలక్ష్మి కెరియర్లో గుర్తుపెట్టుకోదగిన పాత్రలు చాలానే కనిపిస్తాయి. అలాంటి శ్రీలక్ష్మి తాజాగా 'బిగ్ టీవీ'వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన గురించిన అనేక విషయాలను గురించి ప్రసావించారు. "మా అమ్మానాన్నలకు మేం ఆరుగురు సంతానం. మా నాన్నగారు అమర్ నాథ్ అప్పట్లో హీరోగా చేశారు. అయితే సినిమా నిర్మాణం వలన బాగా నష్టపోయారు. హీరోగా అవకాశాలు తగ్గిన తరువాత కేరక్టర్ ఆర్టిస్టుగా చేయలేకపోయారు ... దానికి తోడు అనారోగ్యం. కుటుంబం గడవడానికి మేం సినిమాలు చేస్తామంటే ఒప్పుకునేవారు కాదు. ఆయన చివరి రోజులలో అంగీకరించారు. 'శుభోదయం' సినిమాతో నేను హీరోయిన్ గా పరిచయం కావలసింది. ఆ సమయంలోనే నాన్న చనిపోవడం వలన ఆ ఛాన్స్ పోయింది" అని అన్నారు. "నాన్న చనిపోయారు .. ఏడుగురు కుటుంబ సభ్యులం బ్రతకాలి. అందరూ నా తరువాత వారే. 'నువ్వొక్క దానివి నీ జీవితాన్ని త్యాగం చేస్తే, కుటుంబం గడుస్తుంది .. అందరం బ్రతకొచ్చు. లేదంటే అందరం కలిసి తలా ఇంత విషం తాగడం తప్ప మరో మార్గం లేదు' అని మా అమ్మ నాతో అంది. అలాంటి పరిస్థితులలో ఇక నేను మిగతా విషయాలన్నీ పక్కన పెట్టేసి నా కెరియర్ పై మాత్రమే ఫోకస్ చేయవలసి వచ్చింది" అని చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :