Thursday, 12 March 2026 03:37:48 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Kaalamega Karigindhi : ‘కాలమేగా కరిగింది’ మూవీ రివ్యూ.. అచ్చ తెలుగులో తొలి ప్రేమ కథ..

కాలమేగా కరిగింది ఒక అచ్చ తెలుగు సినిమా అని చెప్పొచ్చు.

Date : 22 March 2025 09:04 AM Views : 395

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Kaalamega Karigindhi Movie Review : వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార.. ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘కాలమేగా కరిగింది’. కలహాలే లేని ఓ ప్రేమకథ ట్యాగ్ లైన్. శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మాణంలో శింగర మోహన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. పూర్తి పొయిటిక్ స్టైల్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా నేడు మార్చ్ 21న థియేటర్స్ లో రిలీజయింది. కథ విషయానికొస్తే.. ఫణి(వినయ్ కుమార్/ చైల్డ్ ఫణి – అరవింద్) లైఫ్ లో సక్సెస్ అయినా ఏదో వెలితిగా ఉంటాడు. తన జీవితంలో ఉన్న తొలి ప్రేమ, ఏకైక ప్రేమ బిందు(శ్రావణి/ చైల్డ్ బిందు – నోమిన తార) గుర్తొస్తుంది. తన టెన్త్ క్లాస్ లో బిందుతో తన ప్రేమ, స్కూల్ లో ఇద్దరూ కలిసి చేసిన ప్రేమ ప్రయాణం, తర్వాత విడిపోవడం, తను ఇంకా ఎదురుచూస్తాను అని చెప్పడం.. ఇవన్నీ గుర్తొచ్చి తన ఊరికి, స్కూల్ కి వెళ్తాడు. అక్కడ తన జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటాడు. టెన్త్ తర్వాత ఫణి – బిందు విడిపోయినా కొన్నాళ్ల పాటు ఉత్తరాలతో మాట్లాడుకుంటారు. డిగ్రీ అయిపోయిన సమయంలో ఓ క్యాసెట్ పంపిస్తుంది బిందు. కానీ అది వినడు. ఇన్నాళ్ల తర్వాత ఫణి తన ఊరికి వచ్చి తన ఇంట్లో ఆ క్యాసెట్ కనపడటంతో వింటాడు. ఆ క్యాసెట్ విన్నాక బిందు ఇంకా తన కోసం వేచి చూస్తుంది అని ఫిక్స్ అయి ఎలాగైనా తనని కలవాలి అనుకుంటాడు. మరి టెన్త్ తర్వాత దూరమయిన ఫణి – బిందు మళ్ళీ కలిశారా? ఆ క్యాసెట్ లో ఏముంది? అసలు ఫణి – బిందు ఎందుకు దూరమయ్యారు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ.. ఈ సినిమా అంతా కవితాత్మకంగా ఉంటుందని ముందే చెప్పారు. ఓ వ్యక్తి తన జీవితంలో ఉన్న ఒకేఒక ప్రేమ కథ, మొదటి ప్రేమ కథ గురించి గుర్తు తెచ్చుకోవడం, ఆ ప్రేమని ఎలా కలిసాడు అనే ఈ కాలమేగా కరిగింది సినిమా. ఫస్ట్ హాఫ్ లో ఫణి లైఫ్ లో సక్సెస్ అయ్యాడు అని కొన్ని మాటల్లో చెప్పేసి స్కూల్ లవ్ స్టోరీకి వెళ్ళిపోతారు. ఫస్ట్ హాఫ్ అంతా ఫణి – బిందు ఎలా ప్రేమలో పడ్డారు అని చూపించి ఇంటర్వెల్ సింపుల్ గా ఇచ్చేస్తారు. ఇక సెకండ్ హాఫ్ లో బిందు – ఫణి ఇంకెంత దగ్గరయ్యారు, ఎలా దూరమయ్యారు, మళ్ళీ వాళ్ళు కలిశారా లేదా అని చూపిస్తారు. క్లైమాక్స్ వాళ్ళు కలుస్తారా, ఎలా కలుస్తారు అనే టెన్షన్ బాగా బిల్డ్ చేసారు. కాలమేగా కరిగింది ఒక అచ్చ తెలుగు సినిమా అని చెప్పొచ్చు. సినిమా అంతా ఆల్మోస్ట్ ఇంగ్లీష్ పదాలు లేకుండా పూర్తి తెలుగులో కవితాత్మకంగా ఉంటాయి డైలాగ్స్. సగం సినిమా వాయిస్ ఓవర్ నేరేషన్ లోనే ఉంటుంది. రెగ్యులర్ కమర్షియల్, థ్రిల్లర్, ఎంటర్టైన్మెంట్ సినిమాలు చూసేవారికి ఈ సినిమా నచ్చకపోవచ్చు. కానీ తెలుగు భాషాభిమానం, ప్యూర్ లవ్ స్టోరీలు చూసేవారికి బాగా నచ్చేస్తుంది. గతంలో ఇదే ఫ్లేవర్ లో షార్ట్ ఫిలిమ్స్ చాలా వచ్చాయి. ఈ సినిమా కూడా కొంతవరకు షార్ట్ ఫిలింలానే అనిపిస్తుంది. సినిమా అయిపోతుంది అనుకునేలోపు ప్రీ క్లైమాక్స్ కాస్త సాగదీశారు. సినిమా అంతా స్లో నేరేషన్ లోనే ఉంటుంది. ఒక ఫ్రెష్ ఫీలింగ్ తో ప్యూర్ స్కూల్ లవ్ స్టోరీ చూడాలంటే కాలమేగా కరిగింది చూడాల్సిందే. స్కూల్ లో మనకు క్రష్ కానీ లవ్ స్టోరీ ఉంటే ఈ సినిమా చూస్తే కచ్చితంగా అది గుర్తొస్తుంది. మన స్కూల్ డేస్ గుర్తొస్తాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :