Wednesday, 17 December 2025 03:23:18 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

Fauzi: 'ఫౌజీ'గా రానున్న ప్రభాస్.. బర్త్‌డే స్పెషల్‌గా టైటిల్ పోస్టర్ విడుదల

Date : 23 October 2025 07:55 PM Views : 199

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ప్రభాస్-హను రాఘవపూడి సినిమాకు టైటిల్ ఖరారు 'ఫౌజీ'గా పేరును ప్రకటించిన చిత్రబృందం ప్రభాస్ 46వ పుట్టినరోజు సందర్భంగా అధికారిక ప్రకటన 1940ల నాటి చారిత్రక యాక్షన్ చిత్రంగా 'ఫౌజీ' ప‌వ‌ర్‌ఫుల్‌ లుక్‌తో ఆకట్టుకుంటున్న ప్రభాస్ రెబల్ స్టార్ ప్రభాస్ తన 46వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుక ఇచ్చారు. ఆయన హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి 'ఫౌజీ' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ గురువారం అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేయగా, అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోంది. గురువారం ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని, నిర్మాణ సంస్థ ఈ ప్రకటన చేసింది. "చరిత్రలోని మరుగునపడిన అధ్యాయాల నుంచి వస్తున్న ఒక సైనికుడి సాహస గాథ ఇది. రెబల్ స్టార్ ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు" అంటూ పోస్టర్‌ను పంచుకుంది. ఈ పోస్టర్‌లో ప్రభాస్ ప‌వ‌ర్‌ఫుల్‌ లుక్‌లో కనిపిస్తుండగా, ఆయన వెనుక బ్రిటిష్ జెండా మంటల్లో కాలిపోతున్న దృశ్యం సినిమాపై అంచనాలను పెంచుతోంది. 1940ల కాలం నాటి చారిత్రక కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో ప్రభాస్ సరసన కథానాయికగా ఇమాన్వి నటిస్తున్నారు. వీరితో పాటు అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భానుచందర్, జయప్రద వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాపై మొదట్నుంచీ భారీ అంచనాలు ఉండటంతో సెట్స్ నుంచి ఏ చిన్న విషయం బయటకు రాకుండా చిత్రబృందం జాగ్రత్తలు తీసుకుంటోంది. 'సీతారామం' చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. సుదీప్ ఛటర్జీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, కృష్ణకాంత్ పాటలు రాస్తున్నారు. ఈ భారీ చారిత్రక చిత్రానికి షీతల్ శర్మ కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :