Sunday, 25 January 2026 05:55:50 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

బాడీ షేమింగ్ పై ఐశ్వర్య రాయ్ ఘాటు స్పందన!

Date : 23 May 2025 12:09 PM Views : 413

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : అంతర్జాతీయ వేదికపై మరోసారి భారత అందాన్ని చాటిచెప్పారు మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా నుదుటన సిందూరం ధరించి కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే, కొంతకాలంగా తన శరీరాకృతి, బరువు పెరుగుదలపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు, ట్రోల్స్‌పై ఐశ్వర్య తాజాగా గట్టిగా స్పందించారు. ఆరాధ్య జన్మించిన తర్వాత ఐశ్వర్య రాయ్ బరువు పెరిగారంటూ గతంలో పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే. పలు సందర్భాల్లో ఆమె బాడీ షేమింగ్‌కు కూడా గురయ్యారు. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ఐశ్వర్య, ఇప్పుడు ఆ విమర్శలకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. "నేను బరువు పెరిగితే మీకొచ్చిన సమస్య ఏంటి? కూతురు పుట్టిన తర్వాత నేను బరువు పెరిగానా లేక ఒంటికి నీరు పట్టిందా అనే దానిపై మీకెందుకంత ఆసక్తి? అది నేను చూసుకుంటాను కదా," అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. తన బరువు తనకు ఎప్పుడూ సమస్య కాదని, ప్రస్తుతం తాను సంతోషంగా తన కుమార్తెను చూసుకుంటున్నానని ఐశ్వర్య స్పష్టం చేశారు. "నా బరువుతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కావాలంటే రాత్రికి రాత్రే బరువు తగ్గించుకోగలను. కానీ నాకు ఆ అవసరం ఇప్పుడు లేదు. ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎవరు ఏమనుకున్నా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు," అని ఆమె తేల్చి చెప్పారు. ఇదిలా ఉండగా, కేన్స్ ఫెస్టివల్‌లో ఐశ్వర్య సిందూరంతో కనిపించడంపై సోషల్ మీడియాలో భిన్నమైన చర్చ జరుగుతోంది. 'ఆపరేషన్ సిందూర్'కు మద్దతుగా ఆమె అలా సిందూరం పెట్టుకున్నారంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :