Sunday, 07 December 2025 08:29:35 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Tollywood: ఒకప్పుడు 500 ఎకరాల ఆసామి.. హీరో మోజుతో రోడ్డున పడ్డాడు.. ఈ స్టార్ కమెడియన్ లైఫ్‌లో ఎన్నో కష్టాలు

సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా ఏ విధంగా టర్న్ అవుతుందో ఎవ్వరూ ఊహించలేరు. రోడ్డుపై తిరిగే వాడిని అనూహ్యంగా మేడలెక్

Date : 09 September 2025 08:46 PM Views : 157

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ఇప్పుడు సాదా సీదా జీవితం గడుపుతోన్న ఈ స్టార్ కమెడియన్ ఒకప్పుడు కోట్ల ఆస్తులకు వారసుడు. ఒక పెద్ద భూస్వామి కుమారుడైన అతనికి ఏకంగా 5 ఎకరాల్లో లగ్జరీ హౌస్ ఉండేది. అలాగే 500 ఎకరాల్లో విలువైన తోటలు, ఆస్తులు ఉండేవి. కానీ తన సినిమాల పిచ్చితో అన్నిటినీ కోల్పోయాడు. ముఖ్యంగా హీరో అవ్వాలన్న మోజుతో ఎడాపెడా సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నాడు. చివరకు చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. ప్రస్తుతం కమెడియన్ గా, సహాయక నటుడిగా సినిమాల్లో కనిపిస్తున్నాడు. తన సినిమాల ద్వారా వచ్చిన సంపాదనతోనే బతకు బండీని లాగుతున్నాడు. ఇంతకీ అతను ఎవరనుకుంటున్నారా? కోలీవుడ్ ప్రముఖ నటుడు, కమెడియన్ సత్యన్. ఇలా పేరు చెబితే ఠక్కున గుర్తు పట్టకపోవచ్చు కానీ శంకర్ దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన ‘స్నేహితుడు’ సినిమాలో సైలెన్సర్‌ అంటే ఇట్టే గుర్తు పడతారు. క్లాస్‌ ఫస్ట్‌ వచ్చేయాలని తెగ కష్టపడే ఇతడిని హీరో ముప్పుతిప్పలు పెడుతూ ఉంటాడు సత్యన్ కొన్ని తెలుగు సినిమాల్లోనూ నటించాడు. నితిన్ భీష్మ మూవీతో పాటు.. ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ సినిమాలోనూ ఈకమెడియన్ మెరిశాడు. అలాగే తెలుగు డబ్బింగ్ సినిమాలతోనూ టాలీవుడ్ ఆడియెన్స్ కు చేరువయ్యాడు. అయితే సత్యన్ ఇప్పుడు కమెడియన్ కావొచ్చు. సహాయక నటుడి పాత్రలు పోషించవచ్చు. కానీ అతను ఒకప్పుడు హీరోగానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. కానీ సక్సెస్ అవ్వలేకపోయాడు.

సత్యన్ ఒక పెద్ద భూస్వామి కొడుకు. తండ్రి మాధంపట్టి శివకుమార్ కు కొన్ని కోట్లు విలువజేసే ఆస్తులున్నాయి. ఇక ఏకైక కుమారుడు కావడంతో సత్యన్ కే ఈ ఆస్తులన్నీ వచ్చాయి. దీంతో అతను లగ్జరీ లైఫ్ కు అలవాటు పడ్డాడు. అదే సమయంలో సినిమాల పిచ్చి సత్యన్ ఆస్తులను కర్పూరంలా కరిగించింది. శివకుమార్‌ నిర్మాతగా మారడంతోనే ఈ కష్టాలు మొదలయ్యాయి. సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నాడు. ఈ నష్టాల నుంచి గట్టెక్కే క్రమంలో ఆస్తులన్నీ అమ్ముకున్నాడు. 2000వ సంవత్సరంలో ఇలయవన్‌ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సత్యన్. అలాగే ‘కన్న ఉన్నై తెడుకిరెన్‌’ అనే మరో సినిమాలో నటించాడు. ఈ రెండు సినిమాలకు సత్యన్ తండ్రే నిర్మాతగా వ్యవహరించడం విశేషం. అయితే దురదృష్టవశాత్తూ ఈ రెండు సినిమాలు ఘోరంగా డిజాస్టర్ అయ్యాయి. దీంతో సత్యన్ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంది. చివరకు బంగ్లాను కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. దీని తర్వాత కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చాడు సత్యన్. ఇప్పుడు తన సినిమాల ద్వారా వచ్చిన ఆదాయంతోనే కుటుంబాన్ని పోషిస్తున్నాడీ స్టార్ కమెడియన్.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :