Monday, 19 January 2026 06:52:52 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Allu Sirish | అనుకున్న‌దొక్క‌టి, అయిన‌దొక్క‌టి.. దేవుడికి వేరే ప్లాన్స్ ఉన్నాయంటూ శిరీష్ పోస్ట్

Allu Sirish | టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరైన అల్లు శిరీష్ కొత్త అడుగు వేయబోతున్నారు. ఆయన తన ప్రియురాలు నైనికాతో నిశ్చితార్థం చేసుకోబోత

Date : 30 October 2025 07:53 PM Views : 354

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Allu Sirish | టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరైన అల్లు శిరీష్ కొత్త అడుగు వేయబోతున్నారు. ఆయన తన ప్రియురాలు నైనికాతో నిశ్చితార్థం చేసుకోబోతున్నట్టు ఇటీవల ప్రకటించడంతో మెగా అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. అయితే, ఈ వేడుకకు వాతావరణం ఆటంకం కలిగించింది. దీంతో అల్లు శిరీష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ షేర్‌ చేస్తూ ..“చలికాలంలో అవుట్‌డోర్ నిశ్చితార్థం ప్లాన్ చేశాను… కానీ వాతావరణం, దేవుడికి వేరే ప్లాన్స్ ఉన్నాయ్” అని రాశారు. వర్షంలో డెకరేషన్ వర్క్స్ జరుగుతున్న ఫోటోను షేర్ చేయడంతో ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్టోబర్ 31న హైదరాబాద్‌లోని తమ సొంతింట్లోనే నిశ్చితార్థం ప్లాన్ చేశారు.. మొదట అవుట్‌డోర్‌లో, గ్రాండ్‌గా డెకరేషన్ చేసి, వెన్నెల వెలుతురులో స్టేజ్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారు. కానీ తుఫాన్ ప్రభావంతో నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆ ఏర్పాట్లు తాత్కాలికంగా నిలిచిపోయాయి. వాతావరణం మెరుగుపడితే ఔట్‌డోర్‌లోనే వేడుక నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ, వర్షం కొనసాగితే సింపుల్‌గా ఇంట్లోనే కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థం జరగనుందని సమాచారం. ఈ వేడుకకు కేవలం అల్లు అర్జున్, స్నేహా రెడ్డి కుటుంబం, అలాగే నైనికా కుటుంబ సభ్యులు మాత్రమే హాజరుకానున్నారు. అల్లు శిరీష్ ఇటీవల నైనికా పేరును ప్రకటించినా, ఆమె ఫేస్‌ను రివీల్ చేయలేదు. అయితే దీపావళి సందర్భంగా జరిగిన కుటుంబ వేడుక ఫోటోల్లో అల్లు అర్జున్ భార్య స్నేహా అనుకోకుండా నైనికా ఫేస్ రివీల్ చేయడంతో సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు వైరల్ అయ్యాయి. విష‌యం తెలుసుకొని స్నేహా రెడ్డి ఆ త‌ర్వాత ఫొటో డిలీట్ చేసిన‌ప్ప‌టికీ అప్ప‌టికే కొంద‌రు స్క్రీన్ షాట్ తీసి నెట్టింట వైర‌ల్ చేశారు. జంట చూడముచ్చ‌ట‌గా ఉంద‌ని చాలా మంది కామెంట్స్ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :