Saturday, 24 January 2026 02:46:17 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Suma Kanakala: 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ పై సుమ కనకాల ట్వీట్

Date : 17 November 2025 06:44 PM Views : 143

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : హైదరాబాదులో వారణాసి టైటిల్ రివీల్ ఈవెంట్ హోస్ట్ గా వ్యవహరించిన సుమ సోషల్ మీడియాలో స్పందన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న 'వారణాసి' చిత్రం కోసం హైదరాబాద్‌లో నిర్వహించిన 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్‌పై స్టార్ యాంకర్ సుమ కనకాల ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించిన ఆమె, ఆ రాత్రిని తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక అద్భుతమైన అనుభవంగా అభివర్ణించారు. "సినిమా చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే రాత్రి ఇది. 130 అడుగుల భారీ ఎల్ఈడీ స్క్రీన్‌పై రాజమౌళి గారు, నటీనటులు, సాంకేతిక నిపుణుల కృషికి జీవం పోసిన తీరు అద్భుతం" అని సుమ తన పోస్టులో పేర్కొన్నారు. ఆ ఈవెంట్ ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ అని, అందులో రాజమౌళి సినిమాలోని అన్ని భావోద్వేగాలు ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ ఈవెంట్‌లో తన హోస్టింగ్‌ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో వచ్చిన సందేశాలు, ట్వీట్లు, రీల్స్‌కు సుమ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. "నాపై ఇంత ప్రేమ కురిపించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రేక్షకులను అలరించడమే నా ప్యాషన్. ఆ ప్యాషన్ ఇలాగే కొనసాగుతుంది" అని ఆమె తన పోస్టులో ఉద్వేగంగా రాసుకొచ్చారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :