Sunday, 25 January 2026 04:58:10 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

టీడీపీకి రూ. 25 లక్షల విరాళాన్ని అందించిన టాలీవుడ్ నిర్మాత నాగవంశీ

Date : 29 May 2025 12:11 PM Views : 251

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత, యువ నిర్మాత నాగవంశీ తెలుగుదేశం పార్టీకి రూ. 25 లక్షల భారీ విరాళం అందించారు. ఈ విషయాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు. కడపలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకల్లో ఈ ప్రకటన వెలువడింది. ప్రతి ఏటా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ మహానాడును ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కడపలో మహానాడు జరుగుతోంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా, పార్టీకి విరాళాలు అందించిన దాతల పేర్లను చంద్రబాబు నాయుడు వేదికపై నుంచి చదివి వినిపించారు. ఈ క్రమంలోనే, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత నాగవంశీ పాతిక లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస చిత్రాలతో దూసుకుపోతున్న నాగవంశీ, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సన్నిహితంగా పనిచేస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించే అనేక చిత్రాల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ భాగస్వామ్యం ప్రముఖంగా కనిపిస్తుంది. కొన్ని సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సౌజన్య పేరును నిర్మాతల్లో ఒకరిగా, ఆయనకు చెందిన ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ పేరును సహ నిర్మాణ సంస్థగా కూడా పేర్కొనడం గమనించవచ్చు. కాగా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి పనిచేస్తున్న నాగవంశీ, తెలుగుదేశం పార్టీకి ఇంత పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వడం రాజకీయ వర్గాల్లోనూ, సినీ పరిశ్రమలోనూ ఆసక్తికర చర్చకు దారితీసింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :