Sunday, 08 March 2026 04:38:59 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Priyanka Chopra: ముంబయిలోని ఫ్లాట్లను అమ్మేస్తున్న ప్రియాంక చోప్రా

అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో స్థిరపడిన ప్రియాంక చోప్రా 16.17 కోట్లకు ముంబయిలోని ఆస్తుల విక్రయం రాజమౌళి తాజా చిత్రంలో నటిస్తున్న ప్రియాంక చోప్రా

Date : 08 March 2025 12:58 PM Views : 908

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ప్రముఖ నటి ప్రియాంక చోప్రా అమెరికన్ గాయకుడు నిక్ జోనాస్‌ను వివాహం చేసుకున్న తర్వాత లాస్ ఏంజిల్స్‌లో స్థిరపడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆమె ఇక్కడ ఉన్న ఆస్తులను విక్రయిస్తున్నారు. తాజాగా కోట్ల రూపాయల డీల్ జరిగినట్లు ఇండెక్స్ ట్యాప్ వెల్లడించింది. ముంబయిలోని అంధేరిలో ఉన్న ఒబెరాయ్ స్కై గార్డెన్‌లో ప్రియాంకకు చెందిన నాలుగు ఫ్లాట్లను ఆమె ఏకంగా రూ.16.17 కోట్లకు విక్రయించారు. గతంలో కూడా ప్రియాంక దేశంలోని పలు ఆస్తులను విక్రయించారు. 2021లో వెర్సోవాలోని రెండు ఇళ్లు, 2023లో లోఖండ్ వాలాలోని రెండు పెంట్ హౌస్‌లను ఆమె విక్రయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమెకు గోవా, న్యూయార్క్, లాస్ ఏంజిల్స్‌లో సొంత భవనాలు ఉన్నాయి. భర్త, కుమార్తెతో కలిసి ప్రియాంక లాస్ ఏంజిల్స్‌లో నివాసం ఉంటున్నారు. ప్రియాంక సినిమాల విషయానికి వస్తే.. ఆమె హాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటిస్తున్నారు. కొంతకాలం క్రితం 'సిటాడెల్' అమెరికన్ వెర్షన్‌లో కథానాయికగా నటించారు. ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న #SSMB29 సినిమాలో ప్రతినాయక పాత్రలో ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టుతో ప్రియాంక చోప్రా తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో రాజమౌళి సినిమాలో కొన్ని రోజులపాటు ఆమె షూటింగ్‌లో పాల్గొన్నారు. తదుపరి షెడ్యూల్స్‌లో పాల్గొనేందుకు ఆమె హైదరాబాద్‌కు రావాల్సి ఉంటుంది. రాజమౌళి సినిమాలు పూర్తి కావడానికి సాధారణంగా ఒకటి లేదా రెండు సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఇక్కడి ఆస్తులు విక్రయించినప్పటికీ ప్రియాంక చోప్రా కొంతకాలం హైదరాబాద్‌లో ఉండవలసిన అవసరం ఉంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :