Wednesday, 17 December 2025 04:06:52 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

ED summons Tamil actors | డ్రగ్స్, మనీలాండరింగ్.. తమిళ నటులు శ్రీకాంత్, కృష్ణ కుమార్‌కు ఈడీ సమన్లు

ED summons | డ్రగ్స్ సరఫరా, మనీలాండరింగ్‌ ఆరోపణలకు సంబంధించిన కేసులో విచారణకు హాజరు కావాలంటూ తమిళ నటులు కె. శ్రీకాంత్(శ్రీరామ్), కృష్ణ కుమార్‌లకు ఎన్‌

Date : 24 October 2025 07:23 PM Views : 102

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ED summons డ్రగ్స్ సరఫరా, మనీలాండరింగ్‌ ఆరోపణలకు సంబంధించిన కేసులో విచారణకు హాజరు కావాలంటూ తమిళ నటులు కె. శ్రీకాంత్(శ్రీరామ్), కృష్ణ కుమార్‌లకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది. ఈ ఇద్దరు నటులను వచ్చే వారం విచారించనున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. అక్టోబర్ 28న శ్రీకాంత్‌ను, అక్టోబర్ 29న కృష్ణ కుమార్‌ను చెన్నైలోని నుంగంబాక్కంలో ఉన్న తమ జోనల్ కార్యాలయంలో విచారణాధికారి ముందు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. చెన్నై పోలీసులు నమోదు చేసిన ఒక కోకైన్ సరఫరా కేసు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తును ప్రారంభించింది. ఈ ఏడాది జూన్‌లో చెన్నై పోలీసులు శ్రీకాంత్, కృష్ణ కుమార్‌లను డ్రగ్స్ కేసులో అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. డ్రగ్స్ వినియోగం కోసం కొనుగోలు చేసిన ఆరోపణలపై వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వారి వద్ద ఎటువంటి మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకోనందున మద్రాస్ హైకోర్టు వారికి జూలై 8, 2025న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసులో మాదకద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా వచ్చిన డబ్బు లావాదేవీలను గుర్తించడానికి ఈడీ ఇప్పుడు దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద నటుల వాంగ్మూలాలను ఈడీ నమోదు చేయనుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :