Monday, 19 January 2026 08:42:37 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Inspection Bungalow: ఓటీటీలో మలయాళం హారర్ థ్రిల్లర్ సిరీస్!

Date : 12 November 2025 06:49 PM Views : 100

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : మలయాళం నుంచి మరో హారర్ సిరీస్ ఈ నెల 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే కథ జీ 5లో తెలుగులోను అందుబాటులోకి ఒకప్పుడు హారర్ కంటెంట్ తో కూడిన సినిమాలు థియేటర్లకు వస్తే, జనాలు పెద్దగా చూసేవారు కాదు. ఎందుకంటే ఈ తరహా కథలను ఇష్టపడే ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే వచ్చేవారు. కానీ అదే హారర్ కంటెంట్ కి ఇప్పుడు ఓటీటీ ట్రాక్ పై విపరీతమైన క్రేజ్ ఉంది. అందువలన శుక్రవారం వచ్చేసరికి ఈ తరహా జోనర్ కి సంబంధించిన సినిమాలు .. సిరీస్ లు క్యూ కడుతున్నాయి. వీటిలో ముందుగా ఏవి చూడాలనే కుతూహలంతో ప్రేక్షకులు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రావడానికి ఒక మలయాళ హారర్ కామెడీ థ్రిల్లర్ సిద్ధమవుతోంది. ఆ సిరీస్ పేరే 'ఇన్స్పెక్షన్ బంగ్లా'. సైజు దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లోశబరీశ్ వర్మ .. షాజు శ్రీధర్ .. జయన్ .. వీణా నాయర్ .. బాలాజీ శర్మ .. సెంథిల్ కృష్ణ ప్రధానమైన పాత్రలను పోషించారు. 'జీ 5'లో ఈ నెల 14వ తేదీ నుంచి మళయాళంతో పాటు తమిళ .. తెలుగు భాషల్లో ఈ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయనున్నారు. కథలోకి వెళితే .. ఒక గ్రామంలోని పోలీస్ స్టేషన్ కి సబ్ ఇన్ స్పెక్టర్ విష్ణుకి బదిలీ అవుతుంది. ఆ గ్రామానికి వచ్చిన అతను, పోలీస్ స్టేషన్ ను ఒక పాడుబడిన బంగళాలోకి మార్చవలసి వస్తుంది. అది ప్రభుత్వానికి సంబంధించిన బంగ్లా. అలా పోలీస్ స్టేషన్ ను ఆ బంగ్లాలోకి మార్చే ప్రయత్నంలో అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి?అందుకు కారణం ఏమిటి? పాడుబడిన ఆ బంగ్లా నేపథ్యం ఏమిటి? అనేది కథ. ap7am.com ను ఎంతమంది చూస్తున్నారో తెలుసా?

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :