Thursday, 12 March 2026 01:08:54 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Nagarjuna | నాగ చైతన్య తండ్రి కాబోతున్నాడా? .. వైరల్ వార్తలపై నాగార్జున క్లారిటీ.. శోభితపై ప్రశంసలు

Nagarjuna | సోషల్ మీడియాలో కొంతకాలంగా హీరో నాగ చైతన్య తండ్రి కాబోతున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారంపై ఇప్పటికే పలుమార్లు చర్

Date : 22 December 2025 06:54 PM Views : 102

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Nagarjuna | సోషల్ మీడియాలో కొంతకాలంగా హీరో నాగ చైతన్య తండ్రి కాబోతున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారంపై ఇప్పటికే పలుమార్లు చర్చ జరగ్గా, తాజాగా ఈ విషయంపై నాగ చైతన్య తండ్రి, సీనియర్ నటుడు నాగార్జున మరోసారి స్పందించారు. ఇటీవల ఓ కార్యక్రమంలో రిపోర్టర్లు ఇదే ప్రశ్నను నాగార్జునను అడగగా, ఆయన “సమయం వచ్చినప్పుడు మేమే చెబుతాం” అంటూ సమాధానం ఇచ్చారు. అయితే ఈ మాటలను తప్పుగా అర్థం చేసుకున్న కొంతమంది నెటిజన్లు, నాగ చైతన్య తండ్రి కాబోతున్నాడనే వార్తలను మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి స్పందించిన నాగార్జున, ఈ రూమర్స్‌కు స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. తండ్రి కావడం, ఒక కుటుంబంలోకి కొత్త వ్యక్తి రావడం అనేది ఎవరికైనా చాలా స్పెషల్ మూమెంట్. అలాంటి విషయాలపై వార్తలు రాసేటప్పుడు కాస్త జాగ్రత్త వహించడం మంచిది అని అన్నారు. శోభిత మా ఇంట్లో అడుగుపెట్టాక ఎంతో సంతోషం వచ్చింది. ఆమె చాలా పాజిటివ్‌గా ఉంటుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఆమెది. ఆమె రాకతో మా జీవితాలు సంతోషంతో కళకళలాడుతున్నాయి. తాతయ్యను చేసే గుడ్ న్యూస్ ఏదైనా ఉంటే మేమే స్వయంగా ప్రకటిస్తాం అని స్పష్టం చేశారు.నాగార్జున చేసిన ఈ వ్యాఖ్యలతో నాగ చైతన్య తండ్రి కాబోతున్నాడంటూ వస్తున్న వార్తలకు పూర్తిగా చెక్ పడినట్టైంది. ప్రస్తుతం నాగ చైతన్య, శోభిత తమ వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. ఇక నాగ చైతన్య కెరీర్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన ‘వృషకర్మ’ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. పీరియాడికల్ థ్రిల్లర్ జానర్‌లో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, వీడియోలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :