Monday, 08 December 2025 04:37:23 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Mohan Lal | ఏనుగు దంతాల కేసులో మోహన్‌లాల్‌కు ఎదురుదెబ్బ.. ఐవ‌రీ ఓన‌ర్‌షిప్ ర‌ద్దు

Ivory Case | మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌కు సంబంధించిన ఏనుగు దంతాల (Ivory Tusks) కేసులో కేరళ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. Facebook Twitter wh

Date : 24 October 2025 07:22 PM Views : 95

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Mohan Lal Ivory Case | మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌కు సంబంధించిన ఏనుగు దంతాల (Ivory Tusks) కేసులో కేరళ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నటుడి వద్ద ఉన్న దంతాల సేకరణను చట్టబద్ధం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన యాజమాన్య ధృవీకరణ (ivory ownership) పత్రాలు చట్టవిరుద్ధమని, న్యాయపరంగా అమలు చేయడానికి అనర్హమని కోర్టు తాజాగా ప్రకటించింది. జస్టిస్ ఏ.కె. జయశంకరన్ నంబియార్, జస్టిస్ జోబిన్ సెబాస్టియన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ తీర్పును ఇవ్వ‌గా.. ఈ తీర్పుతో మోహన్‌లాల్ ఏనుగు దంతాల కేసు మరోసారి కొత్త మలుపు తిరిగింది. 2016 జనవరి, ఏప్రిల్ నెలల్లో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ద్వారా మోహన్‌లాల్‌కు జారీ చేసిన యాజమాన్య ధృవీకరణ పత్రాలను వాటికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను కోర్టు తాజాగా కొట్టివేసింది. ఈ ఉత్తర్వులను జారీ చేసేటప్పుడు వన్యప్రాణి సంరక్షణ చట్టం (Wildlife Protection Act, 1972) లోని విధానపరమైన నిబంధనలను పాటించలేదని, ముఖ్యంగా తప్పనిసరిగా ఉండాల్సిన అధికారిక గెజిట్ ప్రచురణ (Official Gazette Notification) జరగలేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కారణంగా ప్రభుత్వ ఉత్తర్వులు ప్రారంభం నుంచే చెల్లనివి అని పేర్కొంది. అయితే వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972లోని సెక్షన్ 44 ప్రకారం చట్టపరమైన నిబంధనలను అనుసరించి, అవసరమైన అన్ని ప్రక్రియలను పాటించిన తర్వాత కొత్త నోటిఫికేషన్‌ను జారీ చేసే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని హైకోర్టు తెలిపింది. మరోవైపు ఈ అంశంపై నటుడిపై ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసు విచారణకు తమ తీర్పు అడ్డంకి కాదని కోర్టు స్పష్టం చేసింది. ధృవీకరణ పత్రాలు ఎలా జారీ చేయబడ్డాయనే అంశంపై తాము వ్యాఖ్యానించడం లేదని అలా చేస్తే క్రిమినల్ కేసు విచారణపై ప్రభావం పడుతుందని బెంచ్ తెలిపింది. 2012లో మోహన్‌లాల్ నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేసినప్పుడు రెండు జతల ఏనుగు దంతాలు లభించాయి. ఈ దంతాల‌కు సంబంధించి సరైన అనుమతులు లేకపోవడంతో అటవీ శాఖ ఆయనపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా ఆయనకు యాజమాన్య పత్రాలు మంజూరు చేయగా వాటిని సవాలు చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (PILs) దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలపైనే హైకోర్టు తాజాగా ఈ తీర్పునిచ్చింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :