Thursday, 12 March 2026 12:54:58 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Surekha Vani: అమ్మకు మళ్లీ పెళ్లి చేయాలి: సురేఖ వాణి కూతురు సుప్రీత

Date : 09 February 2026 07:08 PM Views : 32

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : తన తల్లికి మంచి భాగస్వామి దొరికితే బాగుంటుందన్న సుప్రీత అమ్మ పెళ్లి చేసుకోవడానికి తమ కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారని వెల్లడి ఆమెకు సినిమా అవకాశాలు రావడం లేదన్న సుప్రీత టాలీవుడ్ లో అందమైన క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో సురేఖ వాణి ఒకరు. ఎన్నో తెలుగు చిత్రాల్లో నటించిన ఆమె ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తమిళనాడులో కూడా ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ, గత కొంత కాలంగా ఆమెకు సినీ అవకాశాలు తగ్గిపోయాయి. అప్పుడప్పుడు మాత్రమే ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. మరోవైపు, ఆమె కూతురు సుప్రీత హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. సుప్రీత హీరోయిన్ గా నటించిన 'అమరావతికి ఆహ్వానం' సినిమా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సుప్రీత మాట్లాడుతూ... తన తల్లి గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తన తల్లి సురేఖకు మళ్లీ పెళ్లి చేయాలనే ఆలోచన తనకు ఉందని సుప్రీత తెలిపింది. ఇదే విషయాన్ని ఇటీవల అమ్మతో చెప్పానని... కానీ ఆమె మాత్రం తన తండ్రి జ్ఞాపకాలతోనే జీవించాలనుకుంటోందని చెప్పింది. తన తండ్రి స్థానంలోకి మరెవరినీ రానివ్వాలనుకోవడం లేదని తెలిపింది. అయితే, తాను పెళ్లి చేసుకునే లోపల... తన తల్లికి మంచి జీవిత భాగస్వామి దొరికితే బాగుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. అమ్మ మరో పెళ్లి చేసుకోవడానికి తమ కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారని తెలిపారు. ఒకప్పుడు ఎంతో బిజీగా ఉన్న తన తల్లికి ఇప్పుడు అవకాశాలు తగ్గిపోయాయని... ఆమె సినిమాల్లో నటించి ఏడాదిన్నర దాటిపోయిందని చెప్పింది. సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉన్నప్పటికీ... అవకాశాలు రావడం లేదని అమ్మ ఫీల్ అవుతోందని తెలిపింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :