Sunday, 08 March 2026 04:15:16 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Jatadhara | డైలామాకు చెక్‌.. సుధీర్‌ బాబు జటాధర థియేటర్లలోకి వచ్చే టైం ఫిక్స్‌

Jatadhara | సుధీర్ బాబు నటిస్తోన్న సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌ జటాధర (Jatadhara). వెంకట్‌ కల్యాణ్ (Venkat Kalyan) కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్ర

Date : 15 September 2025 08:17 PM Views : 582

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Jatadhara | సక్సెస్‌, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న యాక్టర్లలో ఒకడు సుధీర్‌ బాబు (Sudheer babu). ఈ టాలెంటెడ్‌ యాక్టర్ ఈ సారి రూటు మార్చి సరికొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సుధీర్ బాబు నటిస్తోన్న సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌ జటాధర (Jatadhara).

వెంకట్‌ కల్యాణ్ (Venkat Kalyan) కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ తెలుగు, హిందీ బైలింగ్యువల్‌ సినిమాగా వస్తోంది. కాగా మేకర్స్‌ ఎన్నో రోజులుగా విడుదలపై నెలకొన్న డైలామాకు తెరదించారు. ఈ మూవీని నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ కూడా త్వరలో మొదలు కానున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ ఇన్‌సైడ్‌ టాక్. ఓ వైపు శివుడు మరోవైపు చేతిలో త్రిశూలాన్ని పట్టుకున్న సుధీర్‌బాబు, ఇంకోవైపు ఉగ్రరూపంలో కనిపిస్తున్న సోనాక్షి సిన్హా లుక్స్‌ను మేకర్స్‌ ఇప్పటికే విడుదల చేయగా.. సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. ఈ మూవీలో బాలీవుడ్‌ భామ సోనాక్షి సిన్హా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. శిల్పా శిరోద్కర్ కీలక పాత్ర పోషిస్తోంది. సుధీర్‌ బాబు నటించిన హరోం హర, మా నాన్న సూపర్ హీరో సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టాయని తెలిసిందే. దీంతో తన ఆశలన్నీ జటాధర సినిమాపైనే పెట్టుకున్నాడు. మరి ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌ సుధీర్‌బాబుకు ఎంతలా కలిసొస్తుందో చూడాలి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :