Monday, 19 January 2026 07:53:28 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Vinay Rajkumar: ఓటీటీలో కన్నడ రొమాంటిక్ లవ్ స్టోరీ!

Date : 26 November 2025 07:06 PM Views : 227

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : వినయ్ రాజ్ కుమార్ హీరోగా లవ్ స్టోరీ ఆగస్టులో థియేటర్స్ కి వచ్చిన సినిమా యూత్ ను ఆకట్టుకున్న కంటెంట్ రీసెంటుగా అమెజాన్ ప్రైమ్ లోకి తెలుగులోను పలకరించే ఛాన్స్ కన్నడలో వినయ్ రాజ్ కుమార్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ ఆయన ముందుకు వెళుతున్నాడు. ఆడియన్స్ కి ఏ మాత్రం రొటీన్ గా అనిపించకుండా ఎప్పటికప్పుడు జోనర్స్ ను మారుస్తూ కొత్తదనం చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన మరో సినిమానే 'అందోండిట్టు కాలా'. ఆగస్టు 29వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, యూత్ నుంచి మంచి రెస్పాన్స్ ను చూసింది. అలాంటి ఈ సినిమా రీసెంటుగా 'అమెజాన్ ప్రైమ్ వీడియో'కి వచ్చింది. వినయ్ రాజ్ కుమార్ జోడిగా అదితి ప్రభుదేవా అలరించింది. కీర్తి కన్నప్ప దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, ఓటీటీ వైపు నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నట్టుగా తెలుస్తోంది. 1990లలో నడిచే ఈ కథకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. థియేటర్స్ నుంచి కంటే కూడా ఓటీటీ వైపు నుంచి మంచి మార్కులు కొట్టేస్తుందని అంటున్నారు. హీరో - హీరోయిన్స్ మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయిందని చెబుతున్నారు. రొమాంటిక్ లవ్ స్టోరీస్ ఎక్కువగా యూత్ పై ఆధారపడి నడుస్తాయనేది అందరికీ తెలిసిందే. ఈ తరహా కథల్లో ఫీల్ ను పేక్షకులు ఎక్కువగా కోరుకుంటారు. ఫొటోగ్రఫీ .. సంగీతం కూడా ఈ తరహా కథలకు మరింత ప్రాణం పోస్తూ ఉంటాయి. రాఘవేంద్ర సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, నిషా కృష్ణన్ .. అరుణ్ బాలాజీ .. గోవిందే గౌడ .. జగ్గప్ప .. ముఖ్యమైన పాత్రలలో కనిపిస్తారు. తెలుగు ఆడియో కోసం వెయిట్ చేసే ఆడియన్స్ కూడా ఎక్కవగానే ఉన్నారు. త్వరలో తెలుగులోను అందుబాటులోకి వస్తుందేమో చూడాలి మరి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :