Saturday, 24 January 2026 02:16:29 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Kamal Haasan: రాజ్యసభ సభ్యత్వంపై కమల్ హాసన్ భావోద్వేగ స్పందన

Date : 02 December 2025 07:18 PM Views : 215

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : 71 ఏళ్లకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినట్లుందన్న కమల్ హాసన్ ఎంపీగా సంతకం చేశాక తల్లిదండ్రులు గుర్తొచ్చారని వెల్లడి తనను తాను మధ్యేవాదిగా అభివర్ణించుకున్న నటుడు మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ పదవి తనకు 71 ఏళ్ల వయసులో ప్రభుత్వ ఉద్యోగం వచ్చినంత సంతోషాన్ని ఇచ్చిందని ఆయన భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఈ అనుభవాన్ని పంచుకున్నారు. పెద్దల సభకు ఎంపీగా ఎన్నికైనప్పుడు మీ అనుభూతి ఏంటని ఓ వ్యక్తి ప్రశ్నించగా, కమల్ బదులిస్తూ ఆ క్షణంలో తన తల్లిదండ్రులు డి.శ్రీనివాసన్ అయ్యంగార్, రాజ్యలక్ష్మి గుర్తుకువచ్చారని తెలిపారు. "నేనొక స్కూల్ డ్రాపౌట్. కనీసం ఎస్‌ఎస్‌ఎల్‌సీ పాసై ఉంటే రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చేదని మా అమ్మ ఎప్పుడూ అంటుండేవారు. ఇప్పుడు ఎంపీగా సంతకం చేశాక, నా తల్లికి ఫోన్ చేసి నాకు ప్రభుత్వ కొలువు వచ్చిందని చెప్పాలనిపించేంత గర్వంగా అనిపించింది" అని కమల్ వివరించారు. ఇదే కార్యక్రమంలో తన రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుతూ, తనను తాను ఒక మధ్యేవాదిగా అభివర్ణించుకున్నారు. తన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ కూడా తన సైద్ధాంతిక విశ్వాసాలకు అనుగుణంగానే పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే, కమల్ హాసన్ చివరిగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'థగ్ లైఫ్' చిత్రంలో కనిపించారు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :