Thursday, 12 March 2026 03:43:19 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయ కుట్రలో అల్లు అర్జున్ పావుగా మారారు: డీకే అరుణ

అల్లు అర్జున్ నివాసంపై దాడిని బీజేపీ ఖండిస్తోందన్న డీకే అరుణ అల్లు అర్జున్ ను బలిపశువు చేశారని వ్యాఖ్య సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేయడం సరికాదన్న బీజే

Date : 23 December 2024 01:39 PM Views : 427

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : సినీ హీరో అల్లు అర్జున్ ఇంటిపై దాడిని బీజేపీ ఖండిస్తోందని ఆ పార్టీ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఇలాంటి దాడులను ఎవరూ సమర్థించరని చెప్పారు. పోలీసు అధికారులు ఇలాంటి ఘటనల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. అల్లు అర్జున్ నివాసంపై దాడి వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందనిపిస్తోందని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల కుట్రలో అల్లు అర్జున్ పావుగా మారారని డీకే అరుణ అన్నారు. సంధ్య థియేటర్ ఘటనను రాజకీయాలకు వాడుకోవడం సరికాదని చెప్పారు. సీఎం పేరు మర్చిపోయానని అల్లు అర్జున్ అనడాన్ని కేటీఆర్ ట్రోల్ చేశారని... అందుకే అల్లు అర్జున్ ని రేవంత్ టార్గెట్ చేశారని విమర్శించారు. అల్లు అర్జున్ ని బలిపశువు చేశారని డీకే అరుణ అన్నారు. మీకు, కేటీఆర్ కు మధ్య ఉన్న వైరాన్ని సినిమా వాళ్లపై చూపవద్దని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. సినీ ఇండస్ట్రీని రేవంత్ టార్గెట్ చేయడం సరికాదని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడి తప్పాయని విమర్శించారు.

Also Read : సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసే యోచ‌న‌లో టాలీవుడ్ ప్ర‌ముఖులు

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :