Saturday, 24 January 2026 02:26:30 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం ‘క’ సినిమా నుంచి మాస్ జాతర సాంగ్ చూశారా..? భారీగా డిజైన్ చేశారుగా..

Date : 08 October 2024 10:48 AM Views : 298

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం త్వరలో ‘క’ అనే భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమాతో రాబోతున్నాడు. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మాణంలో సుజీత్, సందీప్ ఇద్దరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వి రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ‘క’ సినిమా నుంచి గ్లింప్స్, టీజర్, ఓ సాంగ్ రిలీజ్ చేయగా తాజాగా మరో సాంగ్ రిలీజ్ చేసారు. ‘క’ సినిమా నుంచి మాస్ జాతర అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటను చూస్తుంటే ఊళ్ళో జరిగే ఓ జాతర సీన్ లో వచ్చే సాంగ్ అని తెలుస్తుంది. ఈ పాటకు సనాపాటి భరద్వాజ పాత్రుడు లిరిక్స్ రాయగా సామ్ సీఎస్ సంగీత దర్శకత్వంలో దివాకర్, సామ్ సీఎస్, అభిషేక్ ఏఆర్ పాడారు. ‘ఆడు ఆడు ఆడు ఆడు నిలువెల్లా పూనకమై ఆడు..’ అంటూ జాతర సాంగ్ లా ఈ పాట ప్రేక్షకులని మెప్పిస్తుంది. ఈ పాటకు పొలాకి విజయ్ మాస్ స్టెప్పులు కొరియోగ్రఫీ చేసారు. ఈ సాంగ్ లో కిరణ్ అబ్బవరం అదిరిపోయే డ్యాన్స్ చేసాడు. ఇక ‘క’ సినిమాని తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. మలయాళంలో ఈ సినిమాని దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేస్తుండటం విశేషం. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :