Thursday, 12 March 2026 12:41:49 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Chandrababu: క్షేత్రస్థాయిలో పర్యటించండి... విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు: సీఎం చంద్రబాబు

Date : 09 February 2026 07:11 PM Views : 24

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం హాస్టల్ విద్యార్థుల ఆరోగ్యంపై కీలక వ్యాఖ్యలు... అధికారులదే బాధ్యత అని హెచ్చరిక క్షేత్రస్థాయిలో పర్యటించి పాలన అమలును పరిశీలించాలని మంత్రులకు సూచన గత ప్రభుత్వ అప్పుల వల్ల అధిక వడ్డీలు చెల్లిస్తున్నామని వెల్లడి త్వరలో పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ తీసుకురానున్నట్లు ప్రకటన వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే పటిష్టమైన చర్యలు చేపట్టాలని, హాస్టళ్లలో విద్యార్థులు అనారోగ్యం పాలైతే సంబంధిత జిల్లా కలెక్టర్లు, మంత్రులనే బాధ్యుల్ని చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గట్టిగా హెచ్చరించారు. ప్రభుత్వ పాలసీలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో తెలుసుకునేందుకు మంత్రులు, కార్యదర్శులు తప్పనిసరిగా క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పాలసీలు సమర్థవంతంగా అమలైతేనే ఆశించిన ఫలితాలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం అమరావతి సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల రాష్ట్రం 14 శాతం అధిక వడ్డీతో అప్పులు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ధిక క్రమశిక్షణను గాడిలో పెట్టి, రాష్ట్ర క్రెడిట్ రేటింగ్ పెంచడం ద్వారా వడ్డీ భారాన్ని తగ్గించుకునేందుకు రుణాలను రీషెడ్యూల్ చేస్తున్నామని వివరించారు. ప్రతి ఐదేళ్లకు జీఎస్‌డీపీ, తలసరి ఆదాయం రెట్టింపు కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక దృష్టి ఆరోగ్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం సూచించారు. జూలై నాటికి 66 లక్షల హైరిస్క్ కేసులకు హెల్త్ స్క్రీనింగ్ పూర్తి చేయాలని, 5 లక్షల మంది హాస్టల్ విద్యార్థుల ఆరోగ్య పరీక్షలు చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించారు. గర్భిణుల్లో సిజేరియన్లు తగ్గించి, సాధారణ ప్రసవాలు పెరిగేలా అవగాహన కల్పించాలన్నారు. మాతాశిశు సంరక్షణ కోసం 'కేర్ అండ్ గ్రో' కార్యక్రమాన్ని, అంగన్‌వాడీలు, మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం అందించాలని చెప్పారు. రాష్ట్ర జనాభా నిర్వహణ కోసం మార్చి నాటికి 'పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ' తీసుకురానున్నట్లు సీఎం వెల్లడించారు. విద్యారంగంలో ఒత్తిడి లేని విద్యావిధానం అమలు చేయాలని, పదో తరగతి ఫలితాల్లో మెరుగుదలకు 100 రోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థుల ఆత్మహత్యలు జరగకూడదని, నూతన ఆవిష్కరణలకు స్వేచ్ఛాయుత వాతావరణం ఉండాలని అభిప్రాయపడ్డారు. నీటి సంరక్షణ, అభివృద్ధిపై కీలక సూచనలు రాష్ట్రంలోని 38 వేలకు పైగా ఉన్న చిన్న నీటిపారుదల చెరువులను పరిరక్షించాలని, భూగర్భ జలాలను 'నీటి బ్యాంకు' తరహాలో వాడాలని సూచించారు. పారిశ్రామిక కాలుష్యంతో జలాలు కలుషితం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అల్లూరి జిల్లా లంబసింగిలో కుంకుమ పువ్వు సాగు, ఏలూరు సమీపంలో కోకో సిటీ ఏర్పాటు వంటి వినూత్న ప్రాజెక్టులకు అవకాశాలున్నాయని, వీటిని ప్రోత్సహించాలని సీఎం సూచించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఇతర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :