Thursday, 12 March 2026 01:24:53 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

YCP: మెడికల్ కాలేజీల పీపీపీ అంశంలో కీలక మలుపు.. హైకోర్టులో వైసీపీ పిల్

Date : 07 January 2026 07:27 PM Views : 94

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : పీపీపీ ద్వారా 17 కాలేజీలను నిర్వహించేందుకు సిద్ధమైన ప్రభుత్వం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడిపించాలని హైకోర్టులో వైసీపీ పిల్ ఈరోజు విచారణ చేపట్టనున్న ఏపీ హైకోర్టు ఏపీలోని 17 మెడికల్ కళాశాలలను పీపీపీ ద్వారా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీటిని పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడిపించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో వైసీపీ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (పిల్) దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఇవాళ న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. ప్రజలకు ఉచితంగా, మెరుగైన వైద్య సేవలు అందించేందుకే ఈ మెడికల్ కళాశాలలను తాము ఏర్పాటు చేశామని వైసీపీ తన పిటిషన్‌లో పేర్కొంది. ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థల జోక్యం ఉండకూడదని, అలా జరిగితే పేదలకు వైద్య విద్యా అవకాశాలు దూరమవుతాయని ఆ పార్టీ వాదిస్తోంది. అప్పటి ప్రభుత్వం ఈ కళాశాలల నిర్వహణకు బడ్జెట్ భారం లేకుండా చూసుకునేలా విధానాలు రూపొందించిందని, కొన్ని సీట్లను మాత్రమే డొనేషన్‌కు కేటాయించి ఆ ఆదాయాన్ని ఆసుపత్రుల అభివృద్ధికి వినియోగించేలా మార్గదర్శకాలు తయారు చేసిందని కోర్టుకు పిల్ లో వివరించింది. పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) మోడల్‌లో ఈ కళాశాలలను నడిపిస్తే వైద్య విద్య మాత్రమే కాకుండా, సామాన్యులకు వైద్య సేవలు కూడా అందుబాటులో ఉండవని, అవి కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందని వైసీపీ తన పిల్‌లో ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం చెబుతున్నట్టు ఆర్థిక భారం ఎక్కువగా ఉందన్నది వాస్తవం కాదని, ఇందుకు సంబంధించి ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి కోటి సంతకాలు సేకరించామని కూడా కోర్టుకు తెలిపింది. టెండర్ల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేసింది. ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఎంఎస్‌ఐడీసీ, ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్, నేషనల్ మెడికల్ కౌన్సిల్‌లను వైసీపీ చేర్చింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :