Studio18 News - ANDHRA PRADESH / : పీడీఎస్ బియ్యం అక్రమార్కులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని సంబంధిత అధికారులను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. ఉత్తరాంధ్ర జిల్లాల జాయింట్ కలెక్టర్లు, వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల అధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి నాదెండ్ల కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా రేషన్ బియ్యం విషయంలో అక్రమాలపై ఎట్టిపరిస్థితుల్లో వెనక్కి తగ్గొద్దని అధికారులకు సూచించారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై నేర తీవ్రతను బట్టి పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. 6(ఏ) కేసులు, సీజ్ చేసే విషయంలో అలసత్వం ప్రదర్శించవద్దని స్పష్టం చేశారు. అలాగే జిల్లాల్లో ధాన్యం సేకరణ, సమస్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు 1.61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
Also Read : సెలబ్రెటీల పాపులర్ లిస్ట్ లో శోభిత తర్వాతే సమంత
Admin
Studio18 News