Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పోలీసులకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హోంశాఖ, శాంతిభద్రతలు తన పరిధిలో లేవని స్పష్టం చేశారు. పోలీసులను వారి పని వారిని చేసుకోనివ్వండి... నా పని నేను చేసుకుంటా అని పేర్కొన్నారు. నేను ఏం మాట్లాడినా బాధ్యతగా మాట్లాడాల్సి ఉంటుందని అన్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినవారిని పట్టుకోవడంలో తటపటాయింపు ఎందుకని మీడియా అడిగిందని తెలిపారు. మీడియా నన్ను అడిగిన ప్రశ్నలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతా అని పవన్ కల్యాణ్ వెల్లడించారు. గత ప్రభుత్వంలో బాధ్యత, పారదర్శకత, జవాబుదారీతనం లేవని విమర్శించారు. సమోసాల కోసమే గత ప్రభుత్వం రూ.9 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. పవన్ కల్యాణ్ ఇవాళ ఢిల్లీలో కేంద్రమంత్రులు సీఆర్ పాటిల్, గజేంద్ర షెకావత్ లను కలిశారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
Also Read : మెట్రో రైలు మొదటి దశ సమయంలో నా దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు: ఎన్వీఎస్ రెడ్డి
Admin
Studio18 News