Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : విశాఖ స్టీల్‌ప్లాంట్ వీలినంపై సెయిల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ విశ్వనాథరాజు తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్‌ప్లాంట్ అప్పుల ఊబి నుంచి బయట పడాలంటే సెయిల్‌లో వీలినం చేయడం ఒక్కటే మార్గమని అన్నారు. అంతెందుకు... సొంత గనులు కేటాయించినా స్టీల్‌ప్లాంట్ కోలుకోవడం కష్టమని తెలిపారు. సెయిల్‌లో వీలినం ఒక్కటే దీనికి శాశ్వత పరిష్కారంగా ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లామని చెప్పిన ఆయన... ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ కూడా సానుకూలంగా ఉన్నారని చెప్పారు. సెయిల్‌లో స్టీల్‌ప్లాంట్ వీలినమైతే ఉద్యోగ భద్రతతో పాటు విస్తరణ జరిగే అవకాశం ఉందన్నారు. ఇక స్టీల్‌ప్లాంట్ విషయమై చంద్రబాబు మంగళవారం నాడు ఢిల్లీలో కేంద్ర ఉక్కుశాఖ మంత్రులను కలవనున్నారని విశ్వనాథరాజు తెలిపారు. ఢిల్లీ పెద్దల నుంచి ఈ విషయంలో సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉందన్నారు.
Admin
Studio18 News