Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జగన్ వెళ్తూ వెళ్తూ ఖజానాకు ఖాళీ చేసి వెళ్లారని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలోని పుచ్చకాయలమడలో నిర్వహించిన గ్రామసభలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఎన్నికల్లో ఎంతో చైతన్యంతో కూటమికి ఓట్లు వేశారని ప్రజలను చంద్రబాబు అభినందించారు. ప్రజలు ఎక్కువ మంది కూటమి ఎంపీలకు గెలిపించి మంచి పని చేశారని అన్నారు. హంద్రీనీవా నీటిని అన్ని చెరువులకు ఇవ్వాలని భావించామని, గత ఐదేళ్లలో ఒక్క ఎకరాకు కూడా ఇవ్వలేదని తెలిపారు. వైసీపీ సర్కారు చేసిన విధ్వంసం అంతాఇంతా కాదని చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పుడు పరిశ్రమల యజమానులతో మాట్లాడుతున్నాం పెట్టుబడుల కోసం ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఐదేళ్లలో ప్రతి చోట భూ సమస్యలు సృష్టించారని చెప్పారు. కాగా, అంతకు ముందు సీఎం చంద్రబాబుతో సచివాలయంలో పోలీస్ శాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన ఇన్వస్టిగేషన్ ఏజన్సీస్ ఉన్నతాధికారులతోనూ కంబైన్డ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ ద్వారకా తీరుమలరావు, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్, సీఐడీ ఛీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ హరీశ్ కుమార్ గుప్తా సమావేశంలో పాల్గొన్నారు.
Admin
Studio18 News