Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీకి కేంద్ర రహదారి, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గుడ్ న్యూస్ చెప్పారు. ఏపీలో రోడ్ల అభివృద్ధికి రూ.400 కోట్లు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన ఈ సమాచారం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో 200.06 కిలో మీటర్ల పొడవైన 12 రాష్ట్ర రోడ్ల అభివృద్ధికి కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) నుండి ఈ నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. గుంటూరు – నల్లపాడు రైల్వే మార్గంలో రూ.98 కోట్లతో శంకర్ విలాస్ ఆర్వోబీని నాలుగు వరుసలతో నిర్మించడానికి ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సమయంలో కేంద్ర మంత్రిని కలిసి రాష్ట్ర అవసరాల గురించి చర్చించిన విషయం తెలిసిందే. చంద్రబాబు కలిసి వచ్చిన కొన్ని రోజుల్లోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నుండి ఈ ప్రకటన వెలువడింది.
Admin
Studio18 News