Friday, 13 December 2024 09:33:40 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Garuda Seva: తిరుమలలో రేపటి గరుడ సేవకు విస్తృత ఏర్పాట్లు చేశాం: ఈవో శ్యామలరావు

Date : 07 October 2024 04:11 PM Views : 28

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : తిరుమల వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టం గరుడ సేవ. ఎంతో ప్రాశస్త్యం కలిగిన గరుడ సేవను ప్రత్యక్షంగా చూసి తరించేందుకు లక్షలాదిగా భక్తులు తిరుమల తరలివస్తారు. ప్రస్తుతం తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. రేపు (అక్టోబరు 8) గరుడ సేవ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తోందని ఈవో జె.శ్యామలరావు వెల్లడించారు. గరుడ సేవను వీక్షించేందుకు దాదాపు 3.5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. రద్దీ దృష్ట్యా, తిరుమలకు ఎక్కువ వాహనాలు వచ్చే వీల్లేదని స్పష్టం చేశారు. ఈ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 9 గంటల వరకు ఘాట్ రోడ్డులో ప్రైవేటు ట్యాక్సీలకు అనుమతి లేదని చెప్పారు. ఈ రాత్రి 9 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 9 గంటల వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్రవాహనాలకు అనుమతి లేదని అన్నారు. గరుడ సేవకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ 400కి పైగా బస్సులు అందుబాటులోకి తీసుకుస్తోందని, 3 వేల ట్రిప్పులు నడిపేందుకు ఏర్పాట్లు చేసిందని వివరించారు. భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని ముఖ్య కూడళ్లలో అన్నప్రసాదం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. భద్రతకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేశామని ఈవో చెప్పారు. భద్రతా ఏర్పాట్ల కోసం 1,200 మంది విజిలెన్స్ సిబ్బంది... 3,800 మంది పోలీసులు పనిచేస్తున్నారని తెలిపారు. కేవలం గరుడ సేవ వద్ద 1,500 మంది పోలీసులు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తారని వివరించారు. తిరుమల క్షేత్రంలో భక్తులకు సమాచారం అందించేందుకు ముఖ్యమైన కూడళ్ల వద్ద డిస్ ప్లే బోర్డులు ఏర్పాటు చేసినట్టు ఈవో శ్యామలరావు చెప్పారు. శ్రీవారి భక్తులు సంతృప్తికరంగా గరుడసేవను వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. తిరు మాడ వీధుల్లో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామని, వేలమంది భక్తులు స్వామివారిని దర్శించుకునేలా క్యూలైన్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఇక, తిరుమలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు