Thursday, 12 December 2024 12:17:55 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Chandrababu: ఇసుక విధానంపై చంద్రబాబు సమీక్ష... అధికారులకు కీలక ఆదేశాలు

Date : 22 October 2024 10:42 AM Views : 30

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీలో నూతన ఇసుక విధానంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. సోమవారం సీఎం చంద్రబాబు ఉచిత ఇసుక విధానంపై అధికారులతో సమీక్ష జరిపారు. రాష్ట్రంలోని ఇసుకను పొరుగు రాష్ట్రాలకు తరలించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం సక్రమంగా అమలు జరిగేందుకు, ఇసుక లభ్యత పెంచేందుకు సీనరేజ్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఏపీ నుంచి తమిళనాడులోని చెన్నై, తెలంగాణలోని హైదరాబాద్, కర్ణాటకలోని బెంగళూరు రహదారుల్లో అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతోందన్నారు. కావున.. ఆయా మార్గాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పటిష్ఠ పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఫ్రీ శాండ్ పాలసీలో ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై ఎవరైనా ఫిర్యాదు చేసే విధంగా సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీల పరిధిలో సొంత అవసరాలకు ట్రాక్టర్ ద్వారా కూడా ఇసుక తరలించుకునేందుకు అనుమతులు ఇచ్చామని గుర్తు చేశారు. అయితే ఇసుక తీసుకువెళ్లేవారు గ్రామ, వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఇసుక రీచ్‌లలో తవ్వకాలు, లోడింగ్ నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే అంశంపై ఆలోచన చేయాలని సీఎం చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు