Wednesday, 04 March 2026 08:46:16 AM
# Ambati Rambabu: అంబటి రాంబాబుకు రెండో షాక్... మరో కేసులో రిమాండ్ విధించిన కోర్టు # Jeffrey Epstein: ఎప్‌స్టీన్ మరణ ప్రకటనను అతడు చనిపోవడానికి ముందే రూపొందించారా? # Revanth Reddy: బీజేపీకి లైఫ్ లైన్ అసదుద్దీన్ ఒవైసీయే.. ఆయనే వారికి దేవుడు: రేవంత్ రెడ్డి # Chandrababu: క్షేత్రస్థాయిలో పర్యటించండి... విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు: సీఎం చంద్రబాబు # Surekha Vani: అమ్మకు మళ్లీ పెళ్లి చేయాలి: సురేఖ వాణి కూతురు సుప్రీత # Chandrababu: ఉత్పత్తులకు బ్రాండింగ్, నాణ్యతే ముఖ్యం: సీఎం చంద్రబాబు # Revanth Reddy: మోదీ కచ్చితంగా బడాబాయే.. టీన్యూస్ జర్నలిస్టు ముఖంలో కేసీఆర్‌ను చూడలేను కదా: రేవంత్ రెడ్డి # Punjab: క్లాస్‌రూంలో దారుణం.. క్లాస్‌మేట్‌ను కాల్చి చంపి.. తనూ కాల్చుకున్న విద్యార్థి # Ram Gopal Varma: పిల్లలకు సోషల్ మీడియా నిషేధించాలనే డిమాండ్ పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు # Vijay Deverakonda: విజయ్ దేవరకొండ పెళ్లిపై మీడియా ప్రశ్న... స్పందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ # EPFO: పీఎఫ్ డబ్బులు ఇక యూపీఐతోనే.. ఏప్రిల్ నుంచి కొత్త సేవలు! # Prakash Raj: 'స్పిరిట్' నుంచి తొలగించారన్న వార్తలపై ప్రకాశ్‌ రాజ్‌ స్ట్రాంగ్ కౌంటర్‌ # Telangana Municipal Elections: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి పోలింగ్ # Ali Khamenei: 37 ఏళ్ల సంప్రదాయాన్ని పక్కన పెట్టిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ # AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు

Janga Krishnamurthy: టీటీడీలో అనూహ్య పరిణామం... బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా

Date : 09 January 2026 06:58 PM Views : 147

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : మీడియా కథనాలతో మనస్తాపం చెందడమే కారణమని వెల్లడి బాలాజీ నగర్ ప్లాట్ కేటాయింపు వివాదమే కారణం! వాస్తవాలు తెలుసుకోకుండా కేబినెట్ నిర్ణయం తీసుకుందంటూ ఆవేదన అవకాశం ఇచ్చిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన జంగా పల్నాడు జిల్లాకు చెందిన టీడీపీ నేత జంగా కృష్ణమూర్తి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యత్వానికి అనూహ్యంగా రాజీనామా చేశారు. తనపై మీడియాలో వచ్చిన తప్పుడు కథనాలతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం నాడు ఆయన టీటీడీకి రాజీనామా లేఖను సమర్పించడంతో పాటు, తన నిర్ణయానికి గల కారణాలను వివరిస్తూ మరో లేఖను విడుదల చేశారు. తిరుమల బాలాజీ నగర్‌లోని ప్లాట్ నంబర్ 2 కేటాయింపు వివాదమే ఈ రాజీనామాకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. గతంలో తనకు కేటాయించి, ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈ ప్లాట్‌ను తిరిగి కేటాయించాలని తాను ముఖ్యమంత్రి చంద్రబాబును కోరినట్లు జంగా కృష్ణమూర్తి వివరించారు. సీఎం సూచన మేరకు ఈ అంశం బోర్డు ముందుకు రాగా, సభ్యులు ఆమోదిస్తూ తీర్మానం చేశారని తెలిపారు. అయితే, ఈ వాస్తవాలను వక్రీకరించి మీడియాలో తన వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా కథనాలు ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా, నిన్నటి కేబినెట్ సమావేశంలో వాస్తవాలు నిర్ధారించుకోకుండానే బోర్డు తీర్మానాన్ని రద్దు చేయాలని నిర్ణయించడం తనను తీవ్రంగా బాధించిందని లేఖలో పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే పదవిలో కొనసాగలేనని స్పష్టం చేస్తూ జంగా రాజీనామా చేశారు. శ్రీవారి సేవ చేసేందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, టీటీడీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సేవను కొనసాగించలేకపోతున్నందుకు స్వామివారికి క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :