Wednesday, 04 March 2026 08:46:18 AM
# Ambati Rambabu: అంబటి రాంబాబుకు రెండో షాక్... మరో కేసులో రిమాండ్ విధించిన కోర్టు # Jeffrey Epstein: ఎప్‌స్టీన్ మరణ ప్రకటనను అతడు చనిపోవడానికి ముందే రూపొందించారా? # Revanth Reddy: బీజేపీకి లైఫ్ లైన్ అసదుద్దీన్ ఒవైసీయే.. ఆయనే వారికి దేవుడు: రేవంత్ రెడ్డి # Chandrababu: క్షేత్రస్థాయిలో పర్యటించండి... విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు: సీఎం చంద్రబాబు # Surekha Vani: అమ్మకు మళ్లీ పెళ్లి చేయాలి: సురేఖ వాణి కూతురు సుప్రీత # Chandrababu: ఉత్పత్తులకు బ్రాండింగ్, నాణ్యతే ముఖ్యం: సీఎం చంద్రబాబు # Revanth Reddy: మోదీ కచ్చితంగా బడాబాయే.. టీన్యూస్ జర్నలిస్టు ముఖంలో కేసీఆర్‌ను చూడలేను కదా: రేవంత్ రెడ్డి # Punjab: క్లాస్‌రూంలో దారుణం.. క్లాస్‌మేట్‌ను కాల్చి చంపి.. తనూ కాల్చుకున్న విద్యార్థి # Ram Gopal Varma: పిల్లలకు సోషల్ మీడియా నిషేధించాలనే డిమాండ్ పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు # Vijay Deverakonda: విజయ్ దేవరకొండ పెళ్లిపై మీడియా ప్రశ్న... స్పందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ # EPFO: పీఎఫ్ డబ్బులు ఇక యూపీఐతోనే.. ఏప్రిల్ నుంచి కొత్త సేవలు! # Prakash Raj: 'స్పిరిట్' నుంచి తొలగించారన్న వార్తలపై ప్రకాశ్‌ రాజ్‌ స్ట్రాంగ్ కౌంటర్‌ # Telangana Municipal Elections: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి పోలింగ్ # Ali Khamenei: 37 ఏళ్ల సంప్రదాయాన్ని పక్కన పెట్టిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ # AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు

YSRCP: నంద్యాలలో వైసీపీకి షాక్.. టీడీపీ తీర్థం పుచ్చుకున్న కీలక నేత

Date : 02 January 2026 07:22 PM Views : 119

Studio18 News - ANDHRA PRADESH / Nandyal : టీడీపీలో చేరిన పీవీ ప్రదీప్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డికి ప్రదీప్ రెడ్డి ముఖ్య అనుచరుడు గతంలో వైసీపీ పార్లమెంట్ సోషల్ మీడియా ఇన్‌చార్జిగా బాధ్యతలు ఈ చేరికతో పార్టీ బలోపేతమైందని టీడీపీ వర్గాల ధీమా నంద్యాల జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ పార్లమెంట్ సోషల్ మీడియా ఇన్‌చార్జిగా పనిచేసిన పీవీ ప్రదీప్ రెడ్డి ఇవాళ టీడీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఆయన పార్టీ మారడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ సమక్షంలో ప్రదీప్ రెడ్డి పసుపు కండువా కప్పుకొని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు ఆయనకు సాదర స్వాగతం పలికారు. గతంలో వైసీపీ పార్లమెంట్ సోషల్ మీడియా ఇన్‌చార్జిగా సమర్థవంతంగా నడిపించిన ప్రదీప్ రెడ్డి, ప్రభుత్వ పథకాల ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు. అలాంటి వ్యక్తి టీడీపీలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ... ప్రజాస్వామ్య విలువలకు టీడీపీ కట్టుబడి ఉందని, ప్రజల సమస్యలపై ఆ పార్టీ చేస్తున్న పోరాటం తనను ఆకర్షించిందని తెలిపారు. నంద్యాల అభివృద్ధి, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని టీడీపీ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. పార్టీ అధిష్ఠానం ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ చేరికతో నంద్యాల నియోజకవర్గంలో టీడీపీ మరింత బలపడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రదీప్ రెడ్డి చేరికతో వైసీపీలోని మరికొందరు అసంతృప్త నేతలు టీడీపీ వైపు చూసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :