Studio18 News - ANDHRA PRADESH / : ఇటీవల తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం తెరపైకి వచ్చాక, నటుడు ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియాలో తరచుగా పోస్టులు పెడుతున్నారు. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి చేసిన కొన్ని ట్వీట్లు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. తాజాగా ప్రకాశ్ రాజ్ ఎక్స్ లో చేసిన ఓ ట్వీట్ కూడా నెటిజన్లలో ఆసక్తి రేకెత్తిస్తోంది. "కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ... కదా!... ఇక చాలు... ప్రజల కోసం చేయవలసిన పనులు చూడండి..." అంటూ పేర్కొన్నారు. తన ట్రేడ్ మార్క్ హ్యాష్ ట్యాగ్ 'జస్ట్ ఆస్కింగ్' ను కూడా జోడించారు.
Admin
Studio18 News